గతకొన్ని రోజులుగా ప్రతీ రోజూ రాకెట్ వేగంతో దూసుకుపోయిన బంగారం ధరలు ఈ మధ్యాకాలంలో కాంత శాంతించాయి. అయితే పెద్దగా తగ్గుదల కనిపించకపోయినా, పెరుగుదలకు మాత్రం అడ్డుకట్ట పడింది. తాజాగా ఆదివారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఆదివారం ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. దీంతో దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,200గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,400గా నమోదైంది. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,350కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,550 వద్ద కొనసాగుతోంది.
* ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 57,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400 వద్ద కొనసాగుతోంది.
* చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,800కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ 63,050కి చేరింది.
* బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ. 57,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400కి చేరింది.
* పుణెలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,400కి చేరింది.
* హైదరాబాద్‌లో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,400 వద్ద కొనసాగుతోంది.
* విజయవాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,400గా నమోదైంది.
* విశాఖపట్నంలో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,400 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి కూడా బంగారం దారిలో వెళ్తోంది. ఆదివారం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు సైతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 76,500 వద్ద కొనసాగుతోంది. అలాగే చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఆదివారం కిలో వెండి ధర రూ. 78,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..