
గడిచిన మూడు రోజులుగా ప్రతీ రోజూ తగ్గుతూ వచ్చిన బంగారం ధర, శనివారం మళ్లీ పెరిగింది. అయితే ఈ పెరుగుదల స్వల్పమేనని చెప్పాలి. గడిచిన మూడు రోజులుగా తులంపై రూ. 10 వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధర, ఈరోజు రూ. 10 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,110కి చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,300 వద్ద కొనసాగుతోంది. మరి దేశ వ్యాప్తంగా ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,260గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,450 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థి రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,110గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,300గా ఉంది.
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,610కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,850 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,110కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,300 వద్ద కొనసాగుతోంది.
* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,110కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,300గా ఉంది.
* విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 57,110కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,300 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 57,11గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,300గా ఉంది.
వెండి ధరలో కూడా పెరుగుదల కనిపించింది. గడిచిన మూడు రోజులుగా వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా శనివారం కూడా వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 100 వరకు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. 75,700కి చేరింది. మరి దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, పుణె, జైపూర్, లక్నో వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 75,700గా ఉంది. ఇక చెన్నై, హైదరారాబాద్, విజయవాడ, విశాఖ, కేరళలో కిలో వెండి ధర రూ. 77,100 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..