బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇటీవల నుంచి స్వల్పంగా దిగి వస్తున్న పసిడి ధరలు.. రెండు రోజుల నుంచి దూసుకుపోతున్నాయి. బడ్జెట్ తర్వాత భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ప్రస్తుతం భారీగా పెరుగుతుండటంతో వినియోగదారులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. గత రెండు రోజుల నుంచి ధరలను పరిశీలిస్తే తులం బంగారంపై దాదాపు 1500 రూపాయలకుపైగా ఎగబాకింది. ఇక తాజాగా సెప్టెంబర్ 15వ కూడా భారీగానే పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,650 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,890 వద్ద కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,890 ఉంది.
► ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.75,040 ఉంది.
► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,890 ఉంది.
► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,890 ఉంది.
► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,890 ఉంది.
► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,890 ఉంది.
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం బాటలో వెండి కొనసాగుతుంది. రెండు రోజుల కిందట 84000 ఉన్న వెండి ధర.. ప్రస్తుతం రూ.92,000లకు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో భారీగా ఉంది. చెన్నై, హైదరాబాద్, కేరళ రాష్ట్రాల్లో మాత్రం కిలో వెండి ధర రూ.97,000లకు చేరుకుంది.
భారత దేశంలో బంగారానికి ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే బంగారం రేటు మాత్రం రోజూ మారుతూనే ఉంటుంది. మార్కెట్‌లో గోల్డ్ డిమాండ్, అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా గోల్డ్ రేట్లలో తేడాలు ఉంటాయి.
ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో కీలక కదలికలు కనిపిస్తున్నాయి. గత నెల మొత్తం తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య కదలాడిన బంగారం.. ఇక సెప్టెంబర్ నెలలో స్వల్పంగా తగ్గుతూ వచ్చింది. కానీ రెండు రోజుల నుంచి మాత్రం మహిళలకు షాకిచ్చేలా పెరుగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి