Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

|

Jan 28, 2025 | 6:20 AM

Gold Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి.. ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి.. అయితే.. గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. కొత్త ఏడాది ప్రారంభం నుంచి..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Follow us on

మన దేశంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ధరలు ఎంత పెరిగినా ప్రతి రోజు కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ప్రతి రోజు పరుగులు పెడుతున్న బంగారం ధరలు తాజాగా దిగి వచ్చాయి. జనవరి 28వ తేదీన తులం బంగారంపై స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పది రూపాయల వరకు అతి స్వల్పంగా తగ్గింది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు… తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,240 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో బంగారంపై స్వల్పంగా అంటే వంద రూపాయల వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.96,400 వద్ద ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరలు

  1. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,240 వద్ద ఉంది.
  2. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,240 వద్ద ఉంది.
  3. ఇవి కూడా చదవండి
  4. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,540 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,390 వద్ద ఉంది.
  5. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,240 వద్ద ఉంది.
  6. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,240 ఉంది.
  7. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,240 వద్ద ఉంది.
  8. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,240 వద్ద ఉంది.
  9. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.82,240 వద్ద కొనసాగుతోంది.

బంగారం ఒక ప్రధాన పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. వివాహాలు, పండుగలలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ సంఘటనలు, డిమాండ్, సరఫరా వంటి అనేక కారణాల వల్ల ఈ ధరలు మారుతూ ఉంటాయి. ప్రపంచ మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇందులో ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వంటి పెద్ద కారణాలు ఉన్నాయి. గోల్డ్‌మన్ శాక్స్ ప్రకారం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సెంట్రల్ బ్యాంకుల ద్వారా బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇది రాబోయే కాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి