
Gold Price Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం దిగి వస్తున్నాయి. తులం ధర ఏకంగా లక్షా 30 వేలకుపైగా ఉన్న బంగారం ధర.. ప్రస్తుతం లక్షా 20 వేలకు దిగి వస్తోంది. వెండి ధర కూడా అంతే గతంలో 2 లక్షల రూపాయలకు చేరువలో ఉండగా, ఇప్పుడు 1 లక్షా 55 వేల వరకు దిగి వస్తోంది. తాజాగా నవంబర్ 9వ తేదీన దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఇది కూడా చదవండి: Fact Check: టాటా నుంచి బైక్‌లు.. ధర కేవలం రూ.55,999లకే.. మైలేజీ 100కి.మీ.. నిజమేనా?
ఇక వెండి ధర కిలోకు రూ.1,52,500 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధర ఎందుకు తగ్గుతోంది:
డాలర్ విలువ పెరిగే కొద్దీ బంగారం ధర తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం డాలర్ విలువ పెరిగే కొద్దీ అమెరికా ఫెడరల్ రిజర్వు జారీ చేసే ట్రెజరీ బాండ్లను పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే అమెరికా జారీ చేసే ఈ ట్రెజరీ బాండ్ల పైన రాబడి అందిస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం సురక్షితమైన పెట్టుబడిగా ఉన్నటువంటి బంగారం కన్నా కూడా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టినట్లయితే రాబడి లభించే అవకాశం ఉంటుంది. అందుకే ఇన్వెస్టర్లు బాండ్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 10, 11న పాఠశాలలకు సెలవు!
మరో ప్రధాన కారణం:
ఇక బంగారం ధర తగ్గడానికి మరో ప్రధాన కారణం కూడా ఉంది. అమెరికా స్టాక్ మార్కెట్లలో లాభాలు నమోదు కావడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారు నుంచి నెమ్మదిగా స్టాక్ మార్కెట్ వైపు తరలిస్తున్నారు. ఫలితంగా బంగారం ధరలు తగ్గడం ప్రారంభించాయి.
ఇది కూడా చదవండి: Jio Plans: జియోలో కేవలం రూ.150లోపే అద్భుతమైన ప్లాన్స్.. 28 రోజుల వ్యాలిడిటీ!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి