
బంగారానికి చెడు రోజులు మొదలవ్వవచ్చు. బంగారం ధరలు 10 గ్రాములకు రూ.55,000 వరకు తగ్గుతాయని భావిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బంగారంలో విపరీతమైన పెరుగుదల ఉంది. 2024లో బంగారం 30 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. 2025లో ఇప్పటివరకు బంగారం దాదాపు 20 శాతం పెరిగింది. ఈ పెరుగుదలను బంగారం పెట్టుబడిదారులు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. గత వారం నుంచి బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. తాజాగా ఏప్రిల్ 10వ తేదీన బంగారం ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ.. నిన్న ఉదయం 6 గంటల సమయానికి ఇప్పుడు 6 గంటల సమయానికి ధరలను పోల్చితే భారీగానే పెరిగింది. తులం బంగారంపై ఏకంగా రూ.700కుపైగా పెరిగింది. నిన్న 6 ఉదయం 6 గంటల సమయానికి తులం ధర రూ.89,720 ఉండగా, ప్రస్తుతం ఇదే సమయానికి రూ.90,450 వద్ద ఉంది. అంటే భారీగానే పెరిగిందని తెలుస్తోంది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఇదిలా ఉండగా, ET వార్తల నివేదిక ప్రకారం, రాబోయే సంవత్సరాల్లో బంగారం ధరలు 38 శాతం వరకు తగ్గవచ్చు . అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మార్నింగ్‌స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్ బంగారం ధరలు 38 శాతం తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు 38-40 శాతం తగ్గితే, భారతదేశంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.55,000కి పడిపోతుందని అర్థం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి