Gold Price Today: స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

|

Dec 29, 2024 | 6:48 AM

Gold Price Today: బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ప్రతిరోజూ కనిపిస్తుంటాయి. ఇక గత కొన్ని రోజులుగా భారీగా తగ్గిన బంగారం, వెండి ధర.. గత మూడు రోజులుగా పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా శనివారం దేశంలో నమోదైన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

Gold Price Today: స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Follow us on

Gold Price Today: ఇటీవల కాలంలో బంగారం ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు కనిపించాయి. ఇక గత కొన్ని రోజులుగా భారీగా తగ్గిన బంగారం ధర.. గత మూడు రోజులుగా పెరుగుతూ షాక్ ఇస్తోంది. అయితే, శనివారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 71,510లకు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 78,010గా నమోదైంది. ఇక నేడు ఆదివారం విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 71,350లుగా నమోదైంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 77,840గా నమోదైంది. ఇక వెండి ధర విషయానికొస్తే ఆదివారం కిలో వెండి ధర రూ. 92,600గా ఉంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.71,350 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.77,840 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలోనూ ఇదే ధర కొనసాగుతోంది. అటు దేశ రాజధాని న్యూఢిల్లీలో మాత్రం 22 క్యారెట్ల పసిడి ధర రూ.71500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,990గా ఉంది.

వెండి ధరలు విషయానికొస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో కిలో వెండి రూ. 99,900 ఉండగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో కేజీ వెండి ధర రూ. 92,400గా నమోదైంది. ఇక మీరు తాజాగా నమోదైన బంగారం ధరలను తెలుసుకునేందుకు, 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..