Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్ వచ్చింది. కొంతకాలంగా పెరుగుతూ షాకిస్తోన్న బంగారం ధరలు, ఎట్టకేలకు దిగివస్తున్నాయి. దీంతో బంగారం కొనేందుకు సరైన సమయం ఇదే నంటున్నారు నిపుణులు. గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ సోమవారం రూ. 10 మేరకు బంగారం ధర తగ్గింది. దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,540గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78,030గా నమోదైంది. ఇక కోల్‌కతాతో పాటు చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,390గా నమోదవ్వగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,880గా ఉంది.
మరోవైపు వెండి కూడా బంగారం బాటలో నడుస్తోంది. గత రెండు రోజులుగా వెండి రేట్లు రూ. 4100 మేరకు తగ్గాయి. హైదరాబాద్, కేరళ, చెన్నైలో కిలో వెండి రూ. 99,990లుగా నమోదవ్వగా.. ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, ముంబైలో కేజీ వెండి ధర రూ. 92,400లుగా కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, 8955664433కు మిస్డ్ కాల్ ఇస్తే, చాలు వెంటనే మీ మొబైల్‌కు మెసేజ్ రూపంలో వస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..