Gold Price Today: గోల్డెన్ న్యూస్ అంటే ఇది.. భారీగా తగ్గుతోన్న బంగారం ధరలు.. తులం ఎంతంటే.?

|

Jun 25, 2024 | 7:41 AM

బంగారం ప్రియులకు గోల్డెన్ న్యూస్ ఇది.. గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. రూ. 75 వేల మార్క్ అందుకున్న బంగారం ధర.. భారీగా తగ్గి రూ. 73 వేల మార్క్ దగ్గర కొనసాగుతోంది.మూడు రోజుల వ్యవధిలో సుమారు రూ. వెయ్యికి పైగా తగ్గింది. ఈ తరుణంలో..

Gold Price Today: గోల్డెన్ న్యూస్ అంటే ఇది.. భారీగా తగ్గుతోన్న బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
Gold Price Today
Follow us on

బంగారం ప్రియులకు గోల్డెన్ న్యూస్ ఇది.. గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. రూ. 75 వేల మార్క్ అందుకున్న బంగారం ధర.. భారీగా తగ్గి రూ. 73 వేల మార్క్ దగ్గర కొనసాగుతోంది.మూడు రోజుల వ్యవధిలో సుమారు రూ. వెయ్యికి పైగా తగ్గింది. ఈ తరుణంలో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో మంగళవారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,240గా ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,220 వద్ద కొనసాగుతోంది. మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,390 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,370 వద్ద కొనసాగుతోంది. అటు ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,240 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,220గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,240గా ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,220గా ఉంది. ఇక ఏపీలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే ధర కొనసాగుతోంది.

వెండి ధరలు ఇలా..

వెండి కూడా బంగారం బాటలోనే పయణిస్తోంది. గత మూడు రోజులుగా వెండి రూ. 2400 మేరకు తగ్గింది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పూణే నగరాల్లో కిలో వెండి రూ. 91,600 ఉండగా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రూ. 96,100 వద్ద కొనసాగుతోంది.

ఇది చదవండి: ఏపీ ప్రజలకు ‌గుడ్‌న్యూస్.. ఆ స్టేషన్ వరకు వందేభారత్ రైలు పొడిగింపు.!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..