Gold Price Today: షాకిచ్చిన బంగారం ధరలు.. తులం గోల్డ్ ఎంత పెరిగిందంటే..
దేశంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్య ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగరినా కొనుగోళ్లు మాత్రం ఆగవు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఉంటే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. దేశంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం నిలకడగా ఉన్న బంగారం ధరలు.. తాజాగా శనివారం ఎగబాకాయి. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.250 వరకు పెరుగగా, 24 క్యారెట్ల 10 గ్రాముల..
దేశంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్య ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగరినా కొనుగోళ్లు మాత్రం ఆగవు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఉంటే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. దేశంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం నిలకడగా ఉన్న బంగారం ధరలు.. తాజాగా శనివారం ఎగబాకాయి. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.250 వరకు పెరుగగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.230 వరకు పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా బంగారం ధర చూస్తే 22 క్యారెట్ల 10 గ్రామలు ధర రూ.58,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,230 వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,550 ఉంది. అలాగే ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.58,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,230 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,380 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,230 వద్ద ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58 వేలు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,230 ఉంది. అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58వేలు ఉండగా, అదే 24 క్యారెట్ల ధర రూ.63,230 వద్ద కొనసాగుతోంది.
ఇక దేశీయంగా వెండి ధరలో కొంత మార్పు వచ్చింది. కిలో వెండిపై అతి స్వల్పంగా అంటే రూ.300 వరకు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.79,500 వద్ద ఉంది.