Gold price today : పసిడి ప్రియులకు ఝలక్. గత కొన్ని రోజులుగా బంగారం ధరలలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్షణాల తేడాలో హెచ్చుతగ్గులను నమోదు చేసుకుంటున్నాయి. దీంతో బంగారం కొనాలనుకునేవారిని సందేహంలో పడేస్తున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి పసిడి ధరలు పెరిగాయి. దీంతో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,200 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.46,200గా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో కూడా బంగారం ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి.
హైదరాబాద్ ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.44,850 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల రేట్ రూ. 48,930 దగ్గరగా ఉంది. ఇక విజయవాడ, విశాఖ పట్నం మార్కెట్లలో కూడా బంగారం ధరలలో చేంజ్ కనిపిస్తోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.44,850 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,930గా ఉంది. ఇకపోతే.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.46,590గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,810 ఉంది. ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.46,606 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,160గా ఉంది. ఇక ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,200 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల రేట్ 46,200గా ఉంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకులలో వద్ద ఉన్న పసిడి నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోలిక ఉద్రిక్తతలు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపనున్నాయి. ఫలితంగా పసిడి ధరలలో మార్పులు జరుగనున్నాయి..
Also Read: Facebook: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న ఫేస్బుక్.. ఆ ఎంప్లాయిస్ జీతాలను తగ్గించే యోచనలో సంస్థ..
Facebook: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న ఫేస్బుక్.. ఆ ఎంప్లాయిస్ జీతాలను తగ్గించే యోచనలో సంస్థ..
మీరు కరోనా బారిన పడ్డారా ? ట్రిట్మెంట్కు కావాల్సిన డబ్బు కోసం PF లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే..