Gold Rates Today: బంగారం ధరల్లో ప్రతిరోజూ హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక రోజు తగ్గుతుంటే.. మరో రోజు పెరుగుతుంది. అందుకే బంగారం కొనుగోలు చేసేవారు ఎప్పుడూ రేటు తగ్గుతుందా…? అంటూ ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. దీంతోపాటు ఇళ్లల్లో శుభకార్యాలు ఉండటంతో బంగారంపై ఎక్కువగా దృష్టిసారిస్తుంటారు. మంగళవారం తటస్థంగా ఉన్న బంగారం ధరలు.. బుధవారం కొంతమేర పెరిగాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై దాదాపు 640 రూపాయల మేర పెరిగింది. అయితే తెలుగు రాష్ట్రాలతోపాటు.. కొన్ని నగరాల్లో మాత్రం తగ్గింది. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 570 మేర తగ్గింది. నిన్న రూ.44,070 ఉన్న ధర ఈ రోజు 43,500 ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 47,450 గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 43,620 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,620 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 41,350 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 45,110 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 41,920 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,730 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 41,350 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రూ.45,110 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 41,350 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 45,110 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 41,350 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 45,110 వద్ద కొనసాగుతోంది.
Also Read: