Gold Price Today: రష్యా, ఉక్రెయిన్‌ల (Russia Ukraine Issue) మధ్య నెలకొన్న యుద్ధవాతావరణం నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా గోల్డ్ రేట్స్ (Gold Rates) భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఏకంగా రూ. 50 వేలు దాటేసింది. అయితే గురువారం గోల్డ్ ధరలో భారీగా తగ్గుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. తులంపై ఏకంగా రూ. 400కి పైగా తగ్గింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగారల్లో గురువారం నమోదైన బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,350 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670 గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,810 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,160 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670 గా ఉంది.
* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,350 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670 గా ఉంది.
* సాగరతీరం విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670 వద్ద కొనసాగుతోంది.
Storing Bananas: అరటిపండ్లు త్వరగా కుళ్ళిపోతున్నాయా.. ఈ చిట్కాలను పాటించండి..
Radhe Shyam: సినిమా పోయిందని ప్రభాస్‌కు ముందు చెప్పింది నేనే !!