Gold Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?

బంగారం కొనాలనుకునేవారికి కాస్త రిలీఫ్‌. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తోన్న పసిడి, వెండి ధరలు మంగళవారం (జనవరి 23) మాత్రం స్థిరంగా కొనసాగాయి. సోమవారం (జనవరి 22) తో పోల్చుకుంటే ధరల్లో ఇవాల్టి ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. మంగళవారం ఉదయం

Gold Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?
Gold Price Today

Updated on: Jan 23, 2024 | 6:31 AM

బంగారం కొనాలనుకునేవారికి కాస్త రిలీఫ్‌. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తోన్న పసిడి, వెండి ధరలు మంగళవారం (జనవరి 23) మాత్రం స్థిరంగా కొనసాగాయి. సోమవారం (జనవరి 22) తో పోల్చుకుంటే ధరల్లో ఇవాల్టి ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. మంగళవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,050 గా ఉంది. ఇక వెండి కిలో ధర రూ. 75,500 లుగా కొనసాగుతోంది. మరి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.

తెలుగు రాష్ట్రాల్లో రేట్లు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.63,050 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800, 24 క్యారెట్ల ధర రూ.63,050 లుగా కొనసాగుతున్నాయి.

ఇతర ప్రధాన నగరాల్లో పసిడి ధరలిలా..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.63,200 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,800, 24 క్యారెట్ల ధర రూ.63,050, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,800, 24 క్యారెట్ల ధర రూ.63,050, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,300, 24 క్యారెట్ల ధర రూ.63,600, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,800, 24 క్యారెట్ల ధర రూ.63,050, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.57,800, 24 క్యారెట్ల ధర రూ.63,050 గా ట్రేడ్‌ అవుతోంది.

వెండి ధరలిలా..

హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.77,000, విజయవాడలో రూ.77,000, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.77,000 లు పలుకుతోంది. అలాగే ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,500 గా ఉంది. ముంబైలో రూ.75,500, చెన్నైలో రూ.77,000, బెంగళూరులో రూ.73,000 ఉంది. కేరళలో రూ.77,000, కోల్‌కతాలో రూ.75,500 లుగా ఉంది.

కాగా అమెరికాలో బ్యాంకు వడ్డీ రేటు పెరగవచ్చన్న భయం బంగారం ధరలు తగ్గడానికి కారణమైందని చెప్పుకోవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం బంగారం ధర తగ్గుతోంది, అయితే రాబోయే రోజుల్లో ఇది మళ్లీ పెరుగుతుంది. ఈ ఏడాది (2024 చివరి నాటికి) బంగారం ధర రూ.70,000 మార్కును దాటవచ్చని చెబుతున్నారు.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us