Telugu News Business Gold Price Today: 22nd March 2024 Gold And Silver Rate In Hyderabad Vijayawada Delhi Mumbai Chennai
Gold Price Today: ఈరోజు స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులంపై ఎంతంటే..
స్వర్ణాభరణాలు కొనుగోలుదారులకు కాస్త నిరాశే అనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో పసిడి ధరలు క్రమంగా పెరుగుతూ.. క్షీణిస్తూ వస్తున్నాయి. దీనికి కారణం అంతర్జాతీయంగా డాలర్ విలువలో వచ్చిన మార్పులు, ప్రపంచ దేశాల మధ్య వచ్చిన ఆర్థిక ఇబ్బందులు అని చెప్పాలి. ఇండియన్ మార్కెట్లో ఈరోజు నమోదైన ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
స్వర్ణాభరణాలు కొనుగోలుదారులకు కాస్త నిరాశే అనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో పసిడి ధరలు క్రమంగా పెరుగుతూ.. క్షీణిస్తూ వస్తున్నాయి. దీనికి కారణం అంతర్జాతీయంగా డాలర్ విలువలో వచ్చిన మార్పులు, ప్రపంచ దేశాల మధ్య వచ్చిన ఆర్థిక ఇబ్బందులు అని చెప్పాలి. ఇండియన్ మార్కెట్లో ఈరోజు నమోదైన ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర విషయానికొస్తే.. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర రూ.67,430 అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.61,810 నిన్నటి మార్కెట్ రేట్లతో పోలిస్తే 10 గ్రాములపై రూ.10 పెరిగింది. అలాగే కిలో వెండి ధర రూ. 81,600గా కొనసాగుతోంది. నిన్నటి రేట్లతో పోలిస్తే కిలోపై రూ. 100 పెరిగింది. ఇదే ధరలు విజయవాడలో కూడా కొనసాగుతున్నాయి.
దేశంలోని పలు ప్రధాన పట్టణాల్లో బంగారం ధరల విషయానికొస్తే..
దేశ వాణిజ్య రాజధానిగా పిలువబడే ముంబై నగరంలో పసిడి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,430 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధరలు రూ. 61,810గా కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరలతో పోలిస్తే తులంపై రూ. 10 పెరిగింది.
బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 67,430 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధరలు రూ. 61,810గా కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరలతో పోలిస్తే తులంపై రూ. 10 పెరిగింది.
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం విలువ రూ. 68,030 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 62,360గా కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరలతో పోలిస్తే తులంపై రూ. 10 పెరిగింది.
వెండి ధరలు ఇలా ఉన్నాయి..
ముంబైలో కిలో వెండి ధర నిన్న రూ. 78,500 కాగా ఈరోజు కిలో వెండి ధర రూ. 100 పెరిగి రూ. 78,600కు చేరింది.
చెన్నైలో కిలో వెండి ధర నిన్న రూ. 81,500 ఉండగా.. నేడు కిలో వెండి రూ. 81,600 కు చేరింది. అంటే కిలోపై రూ. 100 పెరిగింది.
బెంగళూరులో కిలో వెండి ధర నిన్న రూ. 76,000 కాగా.. ఈరోజు కిలో వెండిపై రూ. 100 పెరిగి రూ. 76,100కు చేరింది.