ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అయితే, రేట్లు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి. వాస్తవానికి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఇటీవల కాలంలో తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. రెండు రోజుల్లోనే ధర అమాంతం దాదాపు 1000 వరకు పెరిగింది. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఆదివారం (22 సెప్టెంబర్ 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.75,930 ఉండగా.. 22 క్యారెట్లు 69,600 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.93,000లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.69,600, 24 క్యారెట్ల ధర రూ.75,930 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.69,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ.75,930గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.69,750, 24 క్యారెట్ల ధర రూ.76,080, ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.69,600, 24 క్యారెట్లు రూ.75,930, చెన్నైలో 22క్యారెట్ల రేట్ రూ.69,600, 24 క్యారెట్లు రూ.75,930, బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.69,600, 24 క్యారెట్లు రూ.75,930గా ఉంది.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.98,000, విజయవాడ, విశాఖపట్నంలో రూ.98,000 లుగా ఉంది. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.93,000, ముంబైలో రూ.93,000, బెంగళూరులో రూ.85,000, చెన్నైలో రూ.98,000లుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..