Gold Price: మైండ్ బ్లోయింగ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

Gold Price Today: బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూ, తగ్గుతుంటాయి. అంతర్జాతీయ పరిణామాలతో ఈ మార్పులు చోటుచేసుకుంటుంటాయి. కాగా, నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర, నేడు అంటే శుక్రవారం భారీగా తగ్గింది. దీంతో వినియోగదారులకు గుడ్ న్యూస్ వచ్చినట్లైంది. వెండి కూడా అదే బాటలో పయణిస్తోంది. తాజాగా దేశంలో ప్రధాన నగరాల్లో బంగరం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

Gold Price: మైండ్ బ్లోయింగ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Gold Price Today

Updated on: Dec 20, 2024 | 6:57 AM

Gold Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంనే సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఓసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. గత కొన్ని రోజులుగా క్రితం భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అంటే శుక్రవారం గోల్డ్, సిల్వర్ ధర భారీగా తగ్గింది. శుక్రవారం (20 డిసెంబర్ 2024) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.650 తగ్గి రూ.70,690లకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 710లు తగ్గి రూ.77,120లకు చేరుకుంది. వెండి కిలో ధర నిన్నటితో పోల్చితే రూ. 1000లు తగ్గి రూ.98,900లుగా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,690లు కాగా, 24 క్యారెట్ల ధర రూ.77,120లుగా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,690, 24 క్యారెట్ల ధర రూ.77,120లుగా ఉంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.70,840లు కాగా, 24 క్యారెట్ల ధర రూ.77,270లుగా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.70,690లు కాగా, 24 క్యారెట్ల ధర రూ.77,120లుగా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల రేట్ రూ.70,690లుకాగా, 24 క్యారెట్లు రూ.77,120 లుగా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.70,690లు కాగా, 24 క్యారెట్ల ధర రూ.77,120లుగా ఉంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.98,900లుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో రూ.99,900లుగా ఉంది.

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.92,400లు కాగా, ముంబైలో రూ.91,400, బెంగళూరులో రూ.91,400, చెన్నైలో రూ.98,900 లుగా ఉంది.

కాగా, ఈ ధరలు పలు వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us