Gold Price Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

|

May 17, 2021 | 5:52 AM

Today Gold Rates: దేశంలో నిత్యం బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం మనందిరికీ తెలిసిందే. పసిడి ధరలు ఒక రోజు తగ్గుతుంటే.. మరోరోజు

Gold Price Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold Price Today
Follow us on

Today Gold Rates: దేశంలో నిత్యం బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం మనందిరికీ తెలిసిందే. పసిడి ధరలు ఒక రోజు తగ్గుతుంటే.. మరోరోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసేవారు ఎప్పుడు తగ్గుతుందా అని ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టిపెడుతుంటారు. అయితే.. దేశంలో కరోనా ఉధృతి కనిపిస్తున్నప్పటికీ.. కొన్ని రోజుల నుంచి బంగారం ప్రియులకు షాక్ తగులుతోంది. ఇటీవల 40వేల చేరువులోకి వచ్చిన ధరలు.. మళ్లీ 45 వేల మార్క్ దాటాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై 10 రూపాయల మేర పెరిగింది. ఆదివారం 45,060 ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం.. ఈ రోజు సోమవారం 44,070 గా ఉంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర ఈ రోజు 46,210 గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ ధర 50,210 గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,070 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 46,070 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,910 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,990 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,210 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,320 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం.. ధరలు..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,910 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.48,990 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,910 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,990 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,910 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,990 వద్ద కొనసాగుతోంది.

Also Read:

ప్రతిరోజు 7రూపాయలు ఆదా చేయండి.. నెలకు 5వేల పెన్షన్ పొందండి.. ఈ అవకాశాన్ని మిస్ కాకండి..

LPG Cylinder: గ్యాస్‌ కస్టమర్లకు అలర్ట్‌: సీలు చూసి మోసపోవద్దు.. ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే నష్టపోయినట్లే..!