Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు

|

Mar 16, 2022 | 6:22 AM

Gold Silver Price Today: గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాల కారణంగా పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. బంగారానికి..

Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు
Follow us on

Gold Silver Price Today: గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాల కారణంగా పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. బంగారానికి భారతీయులు (Indians) అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం ఆగవు. ప్రస్తుతం దేశంలో బంగారం, వెండి ధరలు (Gold) ధరలు దూసుకుపోతున్నాయి. తాజాగా బుధవారం (మార్చి16)న దేశంలో బంగారం, వెండి (Silver Rate) ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇక దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 600ల వరకు దిగివచ్చింది. ఇక వెండి ధర కూడా భారీగానే దిగి వచ్చింది. ఇక దేశీయంగా కిలో వెండిపై రూ.1000 పైగా తగ్గుముఖం పట్టింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,930, ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,190 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,570 ఉంది. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.51,930 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,930 ఉంది.

వెండి ధరలు

వెండి ధరల విషయానికొస్తే దేశీయంగా కిలో బంగారం ధరపై రూ.1000కిపైగా తగ్గుముఖం పట్టింది. తాజాగా ఢిల్లీలో కిలో బంగారం ధర రూ.69,000 ఉండగా, ముంబైలో రూ.69,000 ఉంది. ఇక చెన్నైలో కిలో బంగారం ధర రూ.72,800 ఉండగా, కోల్‌కతాలో రూ.69,000 ఉంది. బెంగళూరులో కిలో బంగారం ధర రూ.72,800 ఉండగా, కేరళలో రూ.72,800 ఉంది. హైదరాబాద్‌లో కిలో బంగారం ధర రూ.72,800 ఉండగా, విజయవాడలో రూ.72,800 వద్ద కొనసాగుతోంది.

బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

RBI: బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా.. నిబంధనలు పాటించని 8 బ్యాంకులపై జరిమానా విధింపు..!

Ola Electric Scooter: ఓలా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఆ రెండు రోజులే అవకాశం..!