Gold Price Today: భారీగా పడిపోయిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి

|

Nov 05, 2022 | 6:33 AM

గత రెండు రోజులుగా దేశంలో బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. తాజాగా నవంబర్‌ 5వ తేదీన కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇక వెండి మాత్రం షాకిస్తోంది..

Gold Price Today: భారీగా పడిపోయిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి
Gold Price
Follow us on

గత రెండు రోజులుగా దేశంలో బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. తాజాగా నవంబర్‌ 5వ తేదీన కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇక వెండి మాత్రం షాకిస్తోంది. భారీగా పరుగులు పెడుతోంది. దీపావళీ సీజన్‌ లో పెరిగిన పసిడి ధరలు ఇప్పుడు.. దిగి వస్తున్నాయి. దేశంలో బంగారం ధరలలో మార్పులు రావడానికి అనేక కారణాలున్నాయి. వాణిజ్యపరమైన కారణాలు, యుద్ధాలు, ద్రవ్యోల్బణం తదితర కారణాల వల్ల ధరల్లో మార్పులు ఉంటున్నాయి. ఇక 10 గ్రాముల బంగారం ధరపై రూ.660 వరకు తగ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,290 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర దేశీయంగా కిలోపై రూ.1900 వరకు పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఒక విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు. అలాగే రాష్ట్రాల బట్టి పెరుగుదల ఉంటుంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల పన్నులను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,170 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,460 వద్ద ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,440 వద్ద ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 వద్ద ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,340 వద్ద ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 వద్ద ఉంది.

పుణేలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,130 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,320 వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 వద్ద ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 వద్ద ఉంది.

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 వద్ద ఉంది.

వెండి ధర:

వెండి ధరపై భారీగానే పెరిగింది. కిలోపై రూ.1900 వరకు ఎగబాకింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.64,400, ముంబైలో రూ.60,000, ఢిల్లీలో రూ.60,000, కోల్‌కతాలో రూ.60,000, బెంగళూరులో రూ.64,400, కేరళలో రూ.64,400, పుణేలో రూ.60,000, హైదరాబాద్‌లో రూ.64,400, విజయవాడలో రూ.64,400, విశాఖలో కిలో వెండి రూ.64,400 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..