Gold Price Today: గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు కూడా గోల్డ్ బాటలో పయణిస్తున్నాయి. గత రెండు రోజుల్లో బంగారం ధర భారీగా తగ్గింది. మరి లేట్ ఎందుకు అసలే పెళ్లిళ్ల సీజన్ ఇది.. మహిళలకు ఎంతో ఇష్టమైన బంగారాన్ని కొనేందుకు ఇదే మంచి సమయమని..

Gold Price Today: గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?
Gold Price Latest

Updated on: Aug 08, 2024 | 7:32 AM

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు కూడా గోల్డ్ బాటలో పయణిస్తున్నాయి. గత రెండు రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ. 1210 మేరకు తగ్గింది. మరి లేట్ ఎందుకు అసలే పెళ్లిళ్ల సీజన్ ఇది.. భలే మాంచి రోజు.. బంగారం కొనేయండి మరి.! అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం, అమెరికాలో నెలకొన్న ఆర్ధిక మాంద్యం లాంటి అంశాలు ఈ బంగారం ధరలు తగ్గింపునకు ప్రభావం చూపించాయి.

గురువారం దేశంలోని అన్ని నగరాల్లోనూ బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వెండి ధరలు కూడా అదే రీతిలో భారీగానే తగ్గుముఖం పట్టాయి. గడిచిన రెండు రోజుల్లో బంగారం ధరలు ఏకంగా రూ. 1210 తగ్గగా.. వెండి ఏకంగా రూ. 3800 మేరకు తగ్గింది. ఈ స్థాయిలో ధరలు తగ్గడం ఇటీవల కాలంలో చాలా అరుదైన విషయమని మార్కెట్ నిపుణులు అంటున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,490 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 69,260 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 86,900 రూపాయల వద్ద కొనసాగుతుంది.

ఇది చదవండి: కోనసీమ వాసులకు కేంద్రం గుడ్ న్యూస్.. త్వరలోనే అమలాపురం, రాజోలుకు రైలు కూత

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..