Gold Price Today: బంగారం, వెండి కొనే వారికి అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

|

Aug 01, 2024 | 6:43 AM

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే.. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6%కి తగ్గించడంతో ధరలు భారీగా తగ్గాయి.. వాస్తవానికి బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి..

Gold Price Today: బంగారం, వెండి కొనే వారికి అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Prices
Follow us on

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే.. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6%కి తగ్గించడంతో ధరలు భారీగా తగ్గాయి.. వాస్తవానికి బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి.. అయితే.. బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.. మార్కెట్‌ విశ్లేషకుల ప్రకారం.. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలతో పుత్తడి, వెండి ధర భారీగా పెరుగుతోంది.. గురువారం (01 ఆగస్టు 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. తాజాగా స్వల్పంగా ధరలు పెరిగాయి.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పసిడి ధర 69,310 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ 63,490 గా ఉంది. వెండి ధర కిలో రూ.86,600లుగా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,010, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,830గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,010, 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,830గా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,160, 24 క్యారెట్ల ధర రూ.69,980, ముంబైలో 22 క్యారెట్లు రూ.64,010, 24 క్యారెట్లు రూ.69,830, చెన్నైలో 22క్యారెట్లు రూ.64,210, 24 క్యారెట్లు రూ.70,050, బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.64,010, 24 క్యారెట్లు రూ.69,830గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.86,600, ముంబైలో రూ.86,600, బెంగళూరులో రూ.83,900, చెన్నైలో రూ.91,100, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో రూ.91,100 లుగా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..