
Gold Price: 2025 దీపావళికి భారతదేశం సిద్ధమవుతుండగా, బంగారం, వెండి ధరలు మార్కెట్లో మండిపోతున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు వరుసగా 47%, 52% పైగా పెరిగాయి. ఇటీవల MCXలో ధరలు 10 గ్రాములకు రూ. 1,20,000 దాటేసింది. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. బంగారం మునుపటి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు రూ.1.20,770కి చేరుకుంది. అయితే దీపావళి నాటికి రూ.లక్షా 25 వేలు దాటే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad’s First Tesla EV: తెలంగాణలో మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్ కారును కొన్నది ఎవరో తెలుసా?
బలమైన స్పాట్ డిమాండ్ మధ్య, స్పెక్యులేటర్ల తాజా ఒప్పందాల కారణంగా సోమవారం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.1.20 లక్షలు దాటింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికా పరిపాలనలో ప్రతిష్టంభన, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును మరింత తగ్గిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
సోమవారం స్థానిక బులియన్ మార్కెట్లో 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.2,700 పెరిగి రికార్డు స్థాయిలో రూ.1,22,770 (అన్ని పన్నులతో సహా)కు చేరుకుంది. మునుపటి మార్కెట్ సెషన్‌లో బంగారం 10 గ్రాములకు రూ.1,20,000 వద్ద ముగిసింది. ఇక వెండి ధర కూడా వెయ్యి రూపాయలు ఎగబాకింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,56,000 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం దాదాపు 2 శాతం పెరిగి ఔన్సుకు $3,949.58 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని తాకగా, వెండి 1 శాతం పెరిగి ఔన్సుకు $48.75 వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది.
ఇది కూడా చదవండి: Public Holiday: ఇక్కడ అక్టోబర్ 7న పాఠశాలలు, కార్యాలయాలకు సెలవు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి