Gold Price: దీపావళికి ముందు మహిళలకు షాక్‌.. రూ.79 వేలకు చేరుకున్న బంగారం ధర!

|

Oct 17, 2024 | 8:34 PM

ప్రస్తుతం బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. దీపావళి పండగకు ముందు పసిడి ధరలు షాకిస్తున్నాయి. పండగ సమీపిస్తుండటంతో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు..

Gold Price: దీపావళికి ముందు మహిళలకు షాక్‌.. రూ.79 వేలకు చేరుకున్న బంగారం ధర!
Follow us on

దీపావళికి పసిడి దడ మొదలైంది. పండగ సీజనొస్తే చాలు కన్‌జ్యూమర్లలో ఒకటే హైరానా. ఈసారి బంగారం కొనాలా వద్దా..? అదే టెన్షన్ కనిపిస్తోంది ఇప్పుడు కూడా. బంగారం ధర పెరగబోతోందా..? దీపావళి, ధన్ తేరస్ నాటికి పసిడి పరుగు ఎందాకా వెళ్తుంది..? అంటే.. పెరుగుట మాత్రం పక్కా అంటున్నారు నిపుణులు.

ఇది కూడా చదవండి: Tata Sumo: టాటా కారుకు ‘సుమో’ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? అతనికి గౌరవం ఇచ్చిన రతన్‌ టాటా!

ప్రస్తుతం పుత్తడి ధర 10 గ్రాములు 79 వేలకు చేరుకుంది. దీపావళి పెళ్లిళ్ల సీజన్ మొదలైంది గనుక సమీప భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశమే ఉంది. కానీ.. 80 వేల దగ్గర ఆగే ఛాన్సయితే కనిపిస్తోందట.

ఇవి కూడా చదవండి

అక్టోబర్ మొదటి వారంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా (ఆర్బీఐ) పాలసీలో వడ్డీ రేట్లు తగ్గిస్తారని అందరూ అనుకున్నారు. కానీ.. అదేమీ జరగలేదు. అందుకే.. గోల్డ్ మీదే ఇన్వెస్ట్‌మెంట్ బెటరని అందరూ భావించడంతో.. డిమాండ్ పెరిగింది. ధరా పెరిగింది. నవంబర్‌లో యూఎస్ ఫెడరల్ పాలసీ రివిజన్ ఉంది. దాని ప్రభావం కూడా బంగారం ధరలపై ఉండబోతోంది. సో.. ధర ఎంత పెరుగుతుంది.. అనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతానికి కొనుగోళ్లకు మంచి సమయమనేది నిపుణులిస్తున్న సలహా. బంగారం ధర ఇలా ఉంటే వెండి కూడా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.97,000 ఉంది.

ఇది కూడా చదవండి: Aadhaar Update: ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు ఎప్పటి వరకో తెలుసా? అప్‌డేట్‌ ఎందుకు చేయాలి?

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి