
ప్రస్తుతం బంగారం రుణాల పనితీరుపై గత ఏడాది సెప్టెంబర్ 30న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆందోళన వ్యక్తం చేసింది. బంగారంపై రుణాలు, మూలం, బంగారం మూల్యాంకన ప్రక్రియ, డబ్బు వినియోగాన్ని పర్యవేక్షించడం, వేలం పాటల పారదర్శకత, రుణం నుంచి విలువ నిష్పత్తిలో లోపాలను ఆ సమయంలో తన నివేదికలో హైలైట్ చేసింది ఆర్బీఐ.
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అందించే బంగారం రుణాలపై ప్రస్తుతం తిరిగి చెల్లింపులు బుల్లెట్ మాదిరిగా అవలంబిస్తున్నాయని పేర్కొంది. అంటే లోన్ తీసుకున్న కస్టమర్ ప్రతినెలా దాని వడ్డీని మాత్రమే చెల్లిస్తారు. అయితే పూర్తి రుణం మొత్తాన్ని చెల్లించిన తర్వాతే వారి నగలు వారికి తిరిగి ఇస్తారు. అయితే వినియోగదారుడు కోరుకుంటే అతను మధ్యో పాక్షిక చెల్లింపులు కూడా చేసుకోవచ్చు.
ప్రస్తుత బంగారు రుణాల నమూనా బ్యాంకులతోపాటు సామాన్య ప్రజలకు కూడా ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. డిఫాల్ట్ కారణంగా సాధారణ కస్టమర్లు తమ నగలను బ్యాంక్ నుంచి రీడిమ్ చేసుకోలేకపోతున్నారని తెలిపింది.బ్యాంకు కూడా వారి రుణం చెల్లించడంలో డిఫాల్డ్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది.
ఇదిలా ఉండగా, బంగారం రుణాలపై హోం లోన్స్ వంటి ఈఎంఐ విధానాన్ని ఏర్పాటు చేయడం మంచిది. ఇది సామాన్యులకు బంగారంపై తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో సులభతరం అవుతుంది. ఇలాంటి సమయంలో డిఫాల్ట్ వంటి పరిస్థితి ఉండదని ఆర్బీఐ భావిస్తోంది. ప్రస్తుతం బంగారం రుణాలు బంగారం ధరలు హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటుంది. బంగారం ధరలు తగ్గితో లోన్ మొత్తం తగ్గే అవకాశాలు ఉంటాయి. బంగారం ధరలు పెరిగినట్లయితే వినియోగదారులు తమ ఆభరణాలకు తక్కువ విలువను పొందుతారు. ఎందుకంటే వారు పొందే లోన్ మొత్తం పాత బంగారం ధరలపై ఆధారపడి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Gold Price Record: వామ్మో.. ఇక బంగారం కొనడం కష్టమే.. ఒకేసారి భారీగా పెరిగిన ధరలు.. తులంపై..
ఇది కూడా చదవండి: Stock Market: ట్రంప్ సంచలన నిర్ణయం.. 90 రోజుల ఊరటతో స్టాక్ మార్కెట్ల జోష్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి