Gold Loan: గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు: తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలు.. ఏయే బ్యాంకుల్లో ఎంత శాతం అంటే..!

|

Aug 22, 2021 | 2:48 PM

Gold Loan: రుణాల విషయంలో బ్యాంకులు అనేక రకాల ఆఫర్లు అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి. ఇక బంగారంపై కూడా తక్కువ..

Gold Loan: గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు: తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలు.. ఏయే బ్యాంకుల్లో ఎంత శాతం అంటే..!
Follow us on

Gold Loan: రుణాల విషయంలో బ్యాంకులు అనేక రకాల ఆఫర్లు అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి. ఇక బంగారంపై కూడా తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి బ్యాంకులు. ఈ నేపథ్యంలో గోల్డ్‌లోన్‌ పోందాలనుకునే వారికి ఇది తీపి కబురు. ప్రస్తుతం తక్కువ వడ్డీ రేటుకే గోల్డ్ లోన్స్ లభిస్తున్నాయి. బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల్లో మీరు బంగారం తనఖా పెట్టి సులభంగానే రుణం తీసుకోవచ్చు.

బంగారంపై రుణాలు తీసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. వడ్డీ రేట్లు ఎక్కడ తక్కువగా ఉన్నాయో చెక్ చేసుకుని వెళ్లడం బెటర్‌. ఆన్‌లైన్‌లో సులభంగానే వడ్డీ రేట్లను సరిచూసుకోవచ్చు. అలాగే లోన్ ఈఎంఐ టెన్యూర్ వివరాలు కూడా ముందే తెలుసుకోవడం ఉత్తమం.

అలాగే బంగారం విలువలో 75 శాతం వరకు మొత్తాన్ని రుణం రూపంలో పొందే అవకాశం ఉంటుంది. అంటే రూ.లక్ష విలువైన బంగారం ఉంటే.. రూ.75 వేల రుణం పొందవచ్చు. గోల్డ్ లోన్‌పై ఏ ఏ బ్యాంకుల్లో, ఎన్‌బీఎఫ్‌సీల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

బ్యాంక్ బజార్ వివరాల ప్రకారం.. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 7 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. కెనరా బ్యాంక్‌లో 7.35 శాతం నుంచి, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 7.5 శాతం నుంచి, యూనియన్ బ్యాంక్‌లో 8.2 శాతం నుంచి, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8.45 శాతం నుంచి, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 8.75 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 8.95 శాతం నుంచి, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 9 శాతం నుంచి, ఐసీఐసీఐ బ్యాంక్‌లో 11 శాతం నుంచి, యాక్సిస్ బ్యాంక్‌లో 14.5 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం అవుతున్నాయి.

అదే బజాజ్ ఫిన్‌సర్వ్‌లో గోల్డ్ లోన్ పొందాలని భావిస్తే వడ్డీ రేటు 11 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. ముత్తూట్ ఫైనాన్స్‌లో వడ్డీ రేటు 11.9 శాతం నుంచి, మణప్పురం ఫైనాన్స్‌లో 12 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం అవుతున్నాయి. మీరు బంగారంపై రెండేళ్ల కాల పరిమితితో రూ.లక్ష రుణం తీసుకుంటే పై వడ్డీ రేట్ల ప్రకారం నెలకు రూ.4477 నుంచి రూ.4707 వరకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

ఇవీ కూడా చదవండి:

Post Office: సీనియర్‌ సిటిజన్స్‌ కోసం పోస్టల్‌ శాఖ గుడ్‌న్యూస్‌.. నిబంధనలు మార్పుల చేస్తూ కీలక నిర్ణయం..!

Gold Hallmarking: గోల్డ్‌ హాల్‌మార్కింగ్‌పై పెరుగుతున్న వ్యతిరేకత.. దేశ వ్యాప్తంగా ఆగస్టు 23న సమ్మె..!