Gold Loan Interest Rate: సాధారణంగా రుణ అవసరం చాలా మందికి ఉంటుంది. అత్యవసరంగా రుణం కావాల్సినప్పుడు వ్యక్తిగత రుణాల వైపు చూస్తుంటారు. లేకపోతే ఎక్కువగా గోల్డ్ లోన్ వైపు చూస్తుంటారు. ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకుంటారు. సాధారణంగా చాలామందికి అత్యవసరంగా రుణం కావాల్సి వచ్చినప్పుడు పర్సనల్ లోన్ వైపు చూస్తారు. తదుపరి చూపు గోల్డ్ లోన్. బంగారం పైన ఇచ్చే రుణాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఇది సెక్యూర్డ్ లోన్ కాబట్టి పర్సనల్ లోన్ కంటే తక్కువ వడ్డీ రేటు ఉంటుంది. అత్యవసర సమయంలో బంగారం రుణం పొందడం ఇతర మార్గాల కంటే చాలా సులభం. బ్యాంకు ఖాతా ఉంటే బ్యాంకులు వేగంగా గోల్డ్ లోన్ మంజూరు చేస్తాయి. వివిధ బ్యాంకుల్లో వివిధ గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు ఉన్నాయి. బంగారంపై రుణాలు తీసుకుంటే దాని విలువ ప్రకారం రుణం ఇస్తారు. బహిరంగ మార్కెట్ కంటే బ్యాంకుల్లో రుణ వడ్డీ రేటు తక్కువ. అత్యవసర రుణం కోసం గోల్డ్ లోన్ మంచి ఎంపిక అనే చెప్పాలి.
బంగారంపై రుణాలు ఇచ్చే బ్యాంకులు 7.39 శాతం నుండి వడ్డీ రేటును ప్రారంభిస్తున్నాయి. సెక్యూర్డ్ లోన్ కాబట్టి క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా.. లోన్ లభిస్తుంది. సాధారణంగా బంగారం రుణాలలో తాకట్టు పెట్టిన బంగారానికి మార్కెట్ వ్యాల్యూలో 75 శాతం వరకు రుణ సంస్థలు రుణాన్ని ఇస్తున్నాయి. రుణం ఎంత వస్తుంది, వడ్డీ వివరాలు, ప్రాసెసింగ్ ఫీజు, ముందస్తు చెల్లింపు ఛార్జీలు, లేట్ ఫీజు వంటి వాటి గురించి ముందే తెలుసుకోవడం మంచిది. రుణం తీసుకున్న తర్వాత చెల్లింపుల్లో ఆలస్యం చేస్తే అదనపు ఛార్జీలు వసూలు చేస్తాయి. దీని వల్ల అధికంగా డబ్బులు నష్టపోవాల్సి ఉంటుంది. బంగారం రుణాల వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి మారుతాయి. వివిధ బ్యాంకుల్లో వివిధ రకాలుగా వడ్డీ రేట్లు ఉంటాయి.
వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఫెడరల్ బ్యాంకు సంవత్సరానికి వడ్డీ రేటు 7.39 శాతం, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు 7.40 శాతం, ఎస్బీఐ 7.40 శాతం, HDFC బ్యాంకు 7.55 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంకు 7.65 శాతం, కెనరా బ్యాంకు 7.65 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.40 శాతం, కర్నాటక బ్యాంకు 8.49 శాతం, ఇండియన్ బ్యాంకు 8.50 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 8.85 శాతం, యూనియన్ బ్యాంకు 9 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 9.40 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 10 శాతం, యాక్సిస్ బ్యాంకు 14 శాతం అందిస్తున్నాయి. ఎన్బీఎఫ్‌సీల విషయానికి వస్తే మణప్పురం 9.90 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 10 శాతం, ముథూట్ ఫైనాన్స్ 11.90 శాతం ఉన్నాయి. ఇతర ప్రైవేటు కంపెనీల కంటే బ్యాంకుల్లో తక్కువ వడ్డీ ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి