BIS Hallmarking Scheme: జూన్ 1 తర్వాత ఆ బంగారాన్ని అమ్మలేరు.. కొత్తగా కొనాలన్నా ఈ నిబంధనలు పాటించాల్సిందే..!

|

Mar 22, 2021 | 7:34 PM

బంగారానికి భారతదేశపు మహిళలకు అవినాభావ సంబంధం ఉంది. పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు బంగారం, వెండి కొనుగోళ్లు పై దృష్టి పెడతారు. కరోనా వైరస్ విజృంభణ తర్వాత గత ఏడాది ఆల్ టైం హై...

BIS Hallmarking Scheme: జూన్ 1 తర్వాత ఆ బంగారాన్ని అమ్మలేరు.. కొత్తగా కొనాలన్నా ఈ నిబంధనలు పాటించాల్సిందే..!
Registration To Jewellers
Follow us on

BIS Hallmarking Scheme: బంగారానికి భారతదేశపు మహిళలకు అవినాభావ సంబంధం ఉంది. పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు బంగారం, వెండి కొనుగోళ్లు పై దృష్టి పెడతారు. కరోనా వైరస్ విజృంభణ తర్వాత గత ఏడాది ఆల్ టైం హై కి చేరుకున్న బంగారం ధర.. కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత మెల్లగా దిగివస్తుంది.. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పెరిగాయి.. అయితే త్వరలో బంగారం క్రయవిక్రయాలపై కొన్ని కీలక నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తీసుకుని రానున్నది. వివరాల్లోకి వెళ్తే..

పసిడి క్రయవిక్రయాలకు త్వరలో కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS రిజిస్టర్డ్ జ్యువెలర్స్ తాజాగా కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. ఇక జూన్ 1 నుంచి విక్రయించే బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్లు గల బంగారు ఆభరణాలపై తప్పనిసరిగా హాల్‌మార్క్ ఉండాల్సిందే.

ఇలా చేస్తే బంగారం కొనుగోలు దారుల ప్రయోజనాలు కాపాడినట్టు అవుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. దీనివల్ల కస్టమర్, స్వర్ణ కారుడు ఇద్దరూ ప్రయోజనం పొందుతారని తెలిపింది. బంగారం నాణ్యత విషయంలో ఇరు వర్గాల సందేహాలకు తెరపడుతుంది..ఇప్పటి వరకు బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పనిసరి నిబంధన లేదు. 15 జనవరి 2021నే హాల్‌మార్క్ నిబంధన పాటించాలని సూచించింది. జ్యువెలర్స్ అసోసియేషన్ వినతితో 2021 జూన్ 1కి నిబంధన అమలులోకి వచ్చే విధంగా గడువును పెంచారు. ఆభరణాల హాల్‌మార్కింగ్ ప్రక్రియలో బీఐఎస్ ఎ అండ్ హెచ్ సెంటర్‌లో నాణ్యతను తనిఖీ చేస్తాయి. ఇక్కడ పరీక్షించిన తర్వాత ఎ అండ్ హెచ్ సెంటర్‌లో ఆభరణాలపై హాల్‌మార్క్‌ను ముద్రిస్తుంది.

Also Read: తాండూర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకంపనలు.. దొంగ ఓటు ఆరోపణల దుమారం.. కలెక్టర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు

 ‘మా సంగతేంటి సారూ’.. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వీడియోకి మంత్రి కేటీఆర్ రియాక్షన్