Gold Price Today: ఏపీ, తెలంగాణలో 10 గ్రాముల బంగారం ధర ఎంత ఉందో తెలుసా? వెండి పరిస్థితి ఏంటి?

ప్రస్తుతం దేశంలో బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యుడు గ్రాము బంగారం కొనాలంటేనే భయపడిపోతున్నారు. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ వినియోగదారులకు పెద్దగా ఊరటనిచ్చేలా లేవు. తాజాగా ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో తెలుసుకుందాం..

Gold Price Today: ఏపీ, తెలంగాణలో 10 గ్రాముల బంగారం ధర ఎంత ఉందో తెలుసా? వెండి పరిస్థితి ఏంటి?
Gold And Silver Prices

Updated on: Jan 12, 2026 | 7:00 AM

Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం బంగారం కొనాలంటేనే భయపడిపోతున్నారు. గతంలో బంగారం మాత్రమే ధర పెరిగేది. ఇప్పుడు వెండి కూడా అంతకు రెట్టింపుగా దూసుకుపోతోంది. ఎందుకంటే ఇతర ఎలక్ట్రిక్‌ పరికరాలు, ఈవీ వాహనాలలో వెండిని అధికంగా ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు భారీగా వస్తున్నాయి. తయారీ రంగం కూడా మరింతగా ఊపందుకుంది. అందుకే వెండికి డిమాండ్‌ భారీగా ఉంది. అయితే బంగారం ధర నిన్నటితో పోలిస్తే అతి స్వల్పంగా అంటే తులంపై కేవలం పది రూపాయలు మాత్రమే తగ్గింది. కానీ ఈ తగ్గింపు పెద్దగా ఊరటనిచ్చేవిలా లేవు. ధరలు కాస్త ఉపశమనం ఇచ్చినా మళ్లీ మరుసటి రోజు అంతకు రెండింతలు పెరుగుతుండటంతో ఆందోళన కలిగించే అంశం. ఇక ప్రస్తుతం జనవరి 12వ తేదీన దేశంలోని బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,450, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,740 ఉంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,450, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,740 ఉంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,600, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,890 ఉంది.అంటే ఇక్కడ ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,450, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,740 ఉంది.
  5. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,450, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,740 ఉంది.
  6. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,640, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,990 ఉంది. అయితే ఎప్పుడు కూడా చెన్నైలో ధరలు ఎక్కువగా ఉండేవి. కాని ఇప్పుడు కాస్త తక్కువగా ఉన్నాయి.
  7. ఇక వెండి విషయానికొస్తే.. వెండి కూడా అతి స్వల్పంగా తగ్గింది.కిలోపై కేవలం వంద రూపాయలు మాత్రమే తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో సిల్వర్‌ ధర రూ.2,74,900 వద్ద కొనసాగుతోంది. ఇతర నగరాల్లో రూ.2,59,900 ఉంది.

మీరు మీ మొబైల్ ఫోన్‌లో బంగారం రిటైల్ ధరను కూడా తనిఖీ చేయవచ్చు. 8955664433 కు మిస్డ్ కాల్ ఇవ్వండి, మీకు సందేశం వస్తుంది. బంగారం ధర సమాచారం మీకు SMS ద్వారా అందుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి