Gold Price: మహిళలకు ఇది కదా కావాల్సింది.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..?

భారతీయులకు బంగారం అంటే ఆపదలో ఆదుకునే ఆర్థిక భరోసా. శుభకార్యాల సీజన్ వేళ సామాన్యుడిని ఊరిస్తున్న పసిడి ధరలు మంగళవారం కాస్త శాంతించాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం ఎంత తగ్గింది..? దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Gold Price: మహిళలకు ఇది కదా కావాల్సింది.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..?
Gold Price Today In Hyderabad, Vijayawada And Vizag

Updated on: Mar 17, 2026 | 7:04 AM

భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక ఆభరణం కాదు.. అదొక సెంటిమెంట్. పండగైనా, శుభకార్యమైన బంగారం కొనాల్సిందే. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు మంగళవారం స్వల్ప ఊరటనిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో స్థానిక హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ధరల్లో భారీ పెరుగుదల లేకపోవడం మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తోంది.

హైదరాబాద్‌లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు స్వల్పంగా తగ్గింది. సోమవారంతో పోల్చితే 10 గ్రాముల బంగారంపై రూ.10 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,410గా ఉంది. నిన్న ఈ ధరల రూ.1,57,420గా ఉంది. ఇక మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనే 22 క్యారెట్ల తులం బంగారం ధర ప్రస్తుతం రూ.1,44,290గా ఉంది. నిన్న రూ.1,44,300గా ఉన్న ఈ ధర స్వల్పంగా రూ.10 తగ్గింది. బంగారంతో పాటు వెండి కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం 1 కిలో వెండి రూ.2,75,900గా ఉంది. ఇక విజయవాడ, వైజాగ్‌ వంటి నగరాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.

ఇక దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,560 గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,57,570గా ఉండగా.. స్వల్పంగా రూ.10 తగ్గింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,69,900గా ఉంది. ఈ ధర నిన్న రూ.2,70,000గా ఉండగా.. రూ.100 తగ్గింది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,470 గా ఉంది. నిన్నటితో పోల్చితే ఈ ధర రూ.10 తగ్గింది. ఇక కిలో వెండి ధర రూ.2,75,000గా ఉంది. వెండి ధరలు నిన్నటితో పోల్చితే రూ.100 తగ్గింది.

Follow Us