Gold Prices: బంగారం ధరలపై కీలక అప్డేట్.. మరోసారి తగ్గిన ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

దేశీయంగా బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా తగ్గాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రకటన తర్వాత పసిడి ధరలు కుప్పకూలుతున్నాయి. ఒక్కసారిగా తగ్గడంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. అయితే పెట్టుబడులు పెట్టేవారు లాభాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 3న దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఇలా..

Gold Prices: బంగారం ధరలపై కీలక అప్డేట్.. మరోసారి తగ్గిన ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
Today Gold Rate In India

Updated on: Feb 03, 2026 | 6:42 AM

బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. గత కొద్దిరోజులుగా క్రాష్ అవుతూ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా గోల్డ్‌తో పాటు సిల్వర్ ధరలు కూడా భారీ స్థాయిలో కుప్పకూలుతున్నాయి. బడ్జెట్ ప్రకటన తర్వాత పడిసి ధరలు మరింతగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ సంక్షోభాలు, ఆర్ధిక అనిశ్చితి, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌కు త్వరలో కొత్త ఛైర్మన్‌ను ప్రకటించనున్నారనే సంకేతాలు గోల్డ్ ధరలపై ప్రభావితం చూపిస్తున్నాయి. బంగారం ధరలు తగ్గుతుండటం కొనుగోలుదారులకు ఊరటనిస్తుండగా.. డిజిటల్‌గా పెట్టుబడులు పెట్టినవారు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ధరలు పెరిగితే లాభాలను బుక్ చేసుకోవాలని చూస్తున్నారు. మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు ప్రాంతాల వారీగా..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇవాళ రూ.1,53,170 వద్ద కొనసాగుతోండగా.. సోమవారం ఈ ధర రూ.1,53,170 వద్ద స్ధిరపడింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,390 వద్ద కొనసాగుతోంది.

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,160 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,390గా ఉంది.

-చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,52,170 వద్ద కొనసాగుతోండగా.. నిన్న దీని ధర రూ.1,52,180 వద్ద స్ధిరపడింది. 22 క్యారెట్ల రేటు రూ.1,39,490గా ఉంది. సోమవారం ఈ ధర రూ.1,39,500 వద్ద స్ధిరపడింది.

-బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర రూ.1,53,160 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,390గా ఉంది.

-ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,310 వద్ద కొనసాగుతుండగా.. సోమవారం రూ.1,53,320 వద్ద స్ధిరపడింది. 22 క్యారెట్ల రేటు రూ.1,40,540గా ఉంది. సోమవారం రూ.1,40,550 వద్ద స్ధిరపడింది

 

వెండి ధరలు చూస్తే..

-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,99,900 వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ.3 లక్షలు వద్ద స్ధిరపడింది.

-ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2,99,900 వద్ద కొనసాగుతోంది.

-చెన్నైలో కేజీ వెండి రేటు రూ.2,99,900 వద్ద కొనసాగుతోంది.