దేశంలో గత కొన్నాళ్లుగా బంగారం వెండి ధరల్లో హెచ్చు తగ్గులు ఏర్పడుతూనే ఉన్నాయి. అయితే పండగల సమయంలో ఆల్ టైం హైకి చేరుకున్న బంగారం ధర మళ్ళీ క్రమంగా దిగి వస్తున్నాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అయిన తర్వాత డాలర్ క్రమంగా బలపడడంతో పాలు దేశీయంగా పలు అంశాల నేపధ్యంలో పసిడి, వెండి ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు గురవుతున్న క్రమంలో శుక్రవారం పెరిగిన ధరలు ఈ రోజు (శనివారం డిసెంబర్ 7వ) తేదీన తగ్గాయి. బంగారం ధరలు తగ్గితే ఆభరణాలు కొనుగోలు చేద్దామని ఆసక్తిగా ఎదురుచూసే పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.
ఈరోజు (శనివారం డిసెంబర్ 7) హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 77,610 ఉంది. ఇదే క్రమంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,140కి చేరింది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన , విశాఖ పట్నం, విజయవాడ, పొద్దుటూరు, వరంగల్ ల్లో కూడా కొనసాగుతున్నాయి.
వెండి ప్రాచీన కాలం నుంచి బంగారం తర్వాత విలువైన లోహంగా వెండి ప్రసిద్ధిచెందినది. వెండిని కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తారు. దీంతో వెండి ధరల్లో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. బంగారంలో బాటలోనే నడుస్తూ వెండి ధర కూడా దిగి వస్తుంది. శుక్రవారంతో పోలిస్తే నేడు కిలో వెండి ధర రూ. 100లు తగ్గి ఈ రోజు హైదరబాద్ లో కిలో వెండి ధర రూ. 1,00,900 లు గా కొనసాగుతోంది. అయితే ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెటింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..