గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కాస్త శాతించాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు డాలర్ విలువ ఒక్కసారిగా పెరగడం కారణం ఏదైనా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఒకానొక సమయంలో తులం బంగారం రూ. లక్షకు చేరుకుంటుందని అంతా భావించారు. కానీ మళ్లీ రూ. 75 వేలకు చేరువకావడంతో వినియోగదారులకు ఊరటకల్పించింది.
అయితే బంగారం ధర తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు మళ్లీ దూసుకెళ్తున్నాయి. క్రమంగా పెరుగుతూ మరోసారి రూ. 80 వేల మార్కట్‌ను టచ్ చేసేందుకు పరుగులు పెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా శనివారం దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. మరి ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,410గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,890 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,260కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 78,830గా ఉంది. అలాగే బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 72,260కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 78,830 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో శనివారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,260కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,830 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడతో పాటు విశాఖపట్నంలో లోనూ ఇవే ధరలు ఉన్నాయి.
బంగారం ధర పెరిగితే వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కిలో వెండి ధర రూ. లక్ష దాటేయడం విశేషం. ఢిల్లీతోపాటు, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 91,900గా ఉండగా.. హైదరాబాద్, చెన్నై, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రూ. 1,00,900 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో వెండి ధరలు చుక్కలు చూపించడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..