Gold price today: బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట.. ఒకే రోజు రూ. 800 తగ్గిన గోల్డ్‌ రేట్‌. ఈరోజు ఎంత ఉందంటే..

|

Mar 23, 2023 | 6:19 AM

గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలోనే తాజాగా గురువారం మాత్రం గోల్డ్‌ ధరలో తగ్గుదుల...

Gold price today: బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట.. ఒకే రోజు రూ. 800 తగ్గిన గోల్డ్‌ రేట్‌. ఈరోజు ఎంత ఉందంటే..
Gold Price
Follow us on

గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలోనే తాజాగా గురువారం మాత్రం గోల్డ్‌ ధరలో తగ్గుదుల కనింపించింది. ఈ రోజు తులం బంగారంపై ఏకంగా రూ. 800 వరకు తగ్గింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 54,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,670 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 59,670 వద్ద నమోదైంది.

ఇవి కూడా చదవండి

* ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.54,200 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ. 59,670 వద్ద ఉంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 59,180 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 59,130 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 59,130 వద్ద కొనసాగుతోంది.

* విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54, 200గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 59,130 ఉంది.

వెండి ధర ఎలా ఉందంటే..

బంగారం ధరతో పాటు వెండి ధరలోనూ తగ్గుదల కనిపించింది. గురువారం దేశంలో కిలో వెండిపై రూ. 500 వరకు పెరిగింది. ఈరోజు చెన్నైలో కిలో వెండి ధర రూ.74,0600, ముంబైలో రూ. 71,600, ఢిల్లీలో రూ. 71,600, కోల్‌కతాలో కిలో వెండి రూ. 71,600 బెంగళూరులో రూ.74,000, హైదరాబాద్‌లో రూ.74,000, విశాఖ, విజయవాడలో రూ.74,000 వద్ద ఉంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి కొనుగోలు చేయడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..=