Gold Price Today: తగ్గినట్టే తగ్గి.. మళ్లీ భగ్గుమన్న బంగారం.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?

గత నెల ప్రారంభంలో బంగారం ధరలు పసిడి ప్రియులకు చుక్కలు చూపించాయి. అయితే, జూన్ చివరకు వచ్చే సరికి ధరలు మళ్లీ తగ్గాయి. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. మొన్నటి వరకు బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి. కానీ, ఈ రోజు బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయ్.

Gold Price Today: తగ్గినట్టే తగ్గి.. మళ్లీ భగ్గుమన్న బంగారం.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
Gold Price Today

Updated on: Jul 04, 2025 | 7:34 AM

అమెరికా సుంకాలపై ఆందోళనల మధ్య ప్రపంచవ్యాప్తంగా బంగారం అమ్మకాలు భారీగా పెరగడమే కాదు.. ధరలు కూడా పైపైకి ఎగబాకుతున్నాయ్. గత నెలలో తగ్గిన బంగారం ధరలు జూలై మొదటి వారంలోనే మళ్లీ పెరుగుతున్నాయి. జూలై నెల మొదటి మూడురోజుల్లోనే బంగారం ధరల్లో భారీ పెరుగుదల కనిపించడం గమనార్హం. గడిచిన మూడు రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1910 పెరగగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 2080 మేరకు పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 91,210గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 99,490 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 91,060కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 99,340గా ఉంది. అలాగే బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 91,060కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 99,340 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో శుక్రవారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 91,060కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 99,340 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పైపైకి ఎగబాకుతోంది. గడిచిన నాలుగు రోజుల్లో రూ. 3400 మేరకు పెరిగింది. ఢిల్లీతో పాటు, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,11,100గా ఉండగా.. హైదరాబాద్‌, చెన్నై, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రూ. 1,21,100 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..