Gold and Silver Price Today: శుభవార్త.. నిలకడగా ఉన్న బంగారం ధరలు.. భారీగా తగ్గిన వెండి ధరలు

|

Jul 09, 2021 | 6:13 AM

Gold and Silver Price Today: బంగారం కొనుగోలుదారులకు ఊరట. పరుగులు పెడుతున్న పసిడి ధరలకు కాస్త బ్రేకులు పడ్డాయి. గత నాలుగైదు రోజుల నుంచి పెరుగుతూ..

Gold and Silver Price Today: శుభవార్త.. నిలకడగా ఉన్న బంగారం ధరలు.. భారీగా తగ్గిన వెండి ధరలు
Gold And Silver
Follow us on

Gold and Silver Price Today: బంగారం కొనుగోలుదారులకు ఊరట. పరుగులు పెడుతున్న పసిడి ధరలకు కాస్త బ్రేకులు పడ్డాయి. గత నాలుగైదు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం తాజాగా శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. మహిళలకు అత్యంత ఇష్టమైన బంగారం ధరల వైపే ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. ఇక వెండి ధర విషయానికొస్తే బంగారం ధరలు నిలకడగా ఉంటే వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. వెయ్యి రూపాయలకుపైగా తగ్గుముఖం పట్టింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో శుక్రవారం ఉదయం 6 గంటల నాటికి నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

► దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,850 ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,980 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,980 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ఉంది.

వెండి ధరలు

ఇక దేశీయంగా వెండి ధరలు పెరిగాయి. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ధరలు హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,000 ఉండగా, చెన్నైలో రూ.74,100 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.69,000 ఉండగా, కోల్‌కతాలో రూ.69,000 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.69,000 ఉండగా, కేరళలో రూ.69,000 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,100 ఉండగా, విజయవాడలో రూ.74,100 వద్ద కొనసాగుతోంది.

అయితే బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. బంగారం, వెండి కొనుగోలు చేసేవారు వెళ్లే సమయానికి ధరల వివరాలు తెలుసుకొని వెళ్లడం మంచిది.

ఇవీ కూడా చదవండి

IRCTC Char Dham Yatra: యాత్రికులకు గుడ్‌న్యూస్‌.. ఐఆర్‌సీటీసీ కొత్త టూర్‌ ప్యాకేజీ.. పూర్తి వివరాలు

RBI: ఎస్‌బీఐతో పాటు మరో 13 బ్యాంకులకు ఝలక్‌ ఇచ్చిన ఆర్బీఐ.. భారీగా జరిమానా విధింపు.. ఎందుకంటే..!