Gold And Silver Price: గతకొన్ని రోజులగా నేల చూపులు చూసిన బంగారం ధరలు తాజాగా క్రమంగా పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇక మంగళవారం మాత్రం మరోసారి బంగారం ధరల్లో పెద్దగా మార్పులు కనిపంచలేవు. అయితే వెండి విషయంలో మాత్రం పెరుగుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,160 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 48,170 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 67,400 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 43,840, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 44,840గా ఉంది. ఇక వెండి విషయానికొస్తే కిలో రూ. 67,400గా పలికింది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 42,010గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 45,830గా పలికింది. ఇక కిలో వెండి ధర రూ. 71,700 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 42,010గా నమోదుకాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 45,830 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి రూ. 71,400 గా పలుకుతోంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 42,290 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 46,130 వద్ద కొనసాగుతోంది. ఇక ఇక్కడ కిలో వెండి ధర రూ. 71,700 వద్ద కొనసాగుతోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ. 42,010 ఉండగా… 24 క్యారెట్ల గోల్డ్ రూ. 45,830 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో వెండి కిలో రూ. 67,000 వద్ద కొనసాగుతోంది.