దేశీయ మార్కెట్, అంతర్జీయ పరిణామాలతో బంగారం ధరల్లో హెచ్చ తగ్గులుంటాయి. అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, నగల మార్కెట్‌లతో సహా అనేక పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి. దీంతో దేశీయ మార్కెట్‍లో బంగారం ధరలు మారుతూ.. హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా వరసగా రెక్కలు వచ్చినట్లు దూసుకెళ్లిన పసిడి.. గత రెండు వారాలుగా చూస్తే గరిష్ట స్థాయి నుంచి బాగా దిగి వచ్చింది. నేడు (ఫిబ్రవరి 21) పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి కూడా కూడా స్వల్పంగా క్షీణించింది. ఈ నేపథ్యంలో నేడు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో సహా దేశంలో పసిడి వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో సహా దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు..
హైదరాబాద్ మార్కెట్‍లో నేడు పసిడి కొంతమేర దిగి వచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ.100 తగ్గి రూ.52,100కు చేరింది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ. 120 తగ్గి.. రూ.56,830 వద్ద కొనసాగుతోంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్ లోనూ కొనసాగుతున్నాయి.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 10 గ్రా. 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ.52,150 వ వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,890 ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.52,250 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ కాస్ట్ రూ. 57,000వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 10 గ్రా. 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ.52,800.. కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,600ల వద్ద ఉంది.
దేశ వ్యాప్తంగా వెండి ధరలు:
వెండి విషయానికి వస్తే.. గత కొన్ని రోజుల వరకూ బంగారం బాటలోనే వెండి పయనిస్తుంది. క్రమంగా దిగి వస్తుంది. నేడు ఫిబ్రవరి 21వ తేదీ కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 71,700 గా ఉంది. ఇదే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కొనసాగుతున్నాయి.
అయితే బంగారం ధరలు పెరుగుతాయా, మరింత తగ్గుతాయా అన్నది లోతుగా విశ్లేషించుకోవాల్సిందే. ముదుపరులు మళ్లీ బంగారం ధర పెరుగుతుంది అంటున్నారు. ఎందుకంటే దేశంలో బంగారానికి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్ రానున్నది మరోవైపు ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. ఇవన్నీ కలిసి బంగారం కొనుగోళ్లు పెరిగేలా చేయనున్నాయని మార్కెట్ రంగ నిపుణులు అంచనావేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..