గత కాలం నుంచి బంగారాన్ని, వెండిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో మహిళలు మాత్రమే కాదు ముడుపరులు కూడా బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తిని ఎక్కువ చూపిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా పసిడి, వెండి ధరల్లో స్థిరత్వం ఉండడం లేదు. అయితే ఇటీవల కాలంలో దేశీయంగా పసిడి ధర తగ్గుతూ వస్తుంది. దీనికి కారణం అమెరికాలో డాలర్ విలువ పెరగడమే అని మార్కెటింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. డాలర్ విలువ పెరిగే కొద్దీ దేశీయంగా బంగారం ధర తగ్గుతుంది. పసిడి ధరలు తగ్గే కొద్దీ కొనుగోలు పెరుగుతాయి. దీంతో దేశ వ్యాప్తంగా బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపధ్యంలో దేశంలో బంగారం ధర ఈ రోజు (గురువారం సెప్టెంబర్ 05వ తేదీన) స్వల్పంగా తగ్గాయి. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో సహా దేశంలో ప్రధాన నగరాల్లోని నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్లో ఈ రోజు (గురువారం డిసెంబర్ 05 వ తేదీన) 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ. 10 తగ్గి.. రూ. 71, 290 గా కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ (10గ్రాములు) రూ.10 తగ్గి రూ. 77, 770 గా నమోదు నమోదైంది. ఇవే ధరలు తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి ప్రాంతాల్లో కూడా కూడా కొనసాగుతున్నాయి.
బంగారంలో బాటలోనే వెండి ధర పయనిస్తోంది. ఈ రోజు వెండి ధర లో కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 100 తగ్గి 99,400 గా నమోదు అయింది. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో డిసెంబర్ 5 ఉదయం 7 గంటల సమయంలో రూ. 91 వేల మార్క్ వద్ద ట్రేడవుతోంది. అయితే ఈ ధరలు మధ్యాహ్నానికి మారుతూ ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..