Gold Price Today: కొనసాగుతోన్న పసిడి ధరల పతనం.. శుక్రవారం మరోసారి భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్‌.

|

Feb 24, 2023 | 6:25 AM

బంగారం ధరల పతనం కొనసాగుతోంది. గడిచిన నాలుగు రోజుల నుంచి ప్రతీ రోజూ బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన వారం రోజుల్లో తులం గోల్డ్‌పై ఏకంగా రూ. 600 వరకు తగ్గడం విశేషం. శుక్రవారం కూడా బంగారం ధర భారీగా తగ్గింది. తులం గోల్డ్‌పై ఏకంగా రూ. 220 వరకు తగ్గింది...

Gold Price Today: కొనసాగుతోన్న పసిడి ధరల పతనం.. శుక్రవారం మరోసారి భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్‌.
Gold Price
Follow us on

బంగారం ధరల పతనం కొనసాగుతోంది. గడిచిన నాలుగు రోజుల నుంచి ప్రతీ రోజూ బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన వారం రోజుల్లో తులం గోల్డ్‌పై ఏకంగా రూ. 600 వరకు తగ్గడం విశేషం. శుక్రవారం కూడా బంగారం ధర భారీగా తగ్గింది. తులం గోల్డ్‌పై ఏకంగా రూ. 220 వరకు తగ్గింది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర తగ్గింది. నేడు దేశంలోని పలు మేజర్‌ పట్టణాల్లో నమోదైన బంగారం ధరలపై ఓ లుక్కేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,610 ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510 ఉంది.

ఇవి కూడా చదవండి

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,220 ఉంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,560గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510 ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510 ఉంది.

* విశాఖటపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510 ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఓవైపు బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలో పెద్దగా మార్పు కనిపించలేదు. వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,800కాగా, ముంబైలో రూ. 68,800 , బెంగళూరులో రూ. 71,500 , చెన్నైలో రూ. 71,500 గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 71,500 విజయవాడలో, విశాఖపట్నంలో రూ. 71,500 వద్ద కొనసాగుతోంది.