Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. 5 రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే?

|

Sep 17, 2024 | 9:53 AM

స్టాక్ మార్కెట్ మాదిరిగానే గోల్డ్ ధరల్లో కూడా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒక రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ.. ఇంకో రోజూ పెరుగుతూ.. గోల్డ్ లవర్స్‌కి చుక్కలు చూపిస్తున్నాయి. ఇదిలా ఉండగా..

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. 5 రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే?
Follow us on

స్టాక్ మార్కెట్ మాదిరిగానే గోల్డ్ ధరల్లో కూడా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒక రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ.. ఇంకో రోజూ పెరుగుతూ.. గోల్డ్ లవర్స్‌కి చుక్కలు చూపిస్తున్నాయి. ఇదిలా ఉండగా. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు మరింతగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 170 పెరిగి రూ. 75,060కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ. 160 పెరిగి రూ. 68,810 పలుకుతోంది. గత 5 రోజుల్లో బంగారం ధరలు ఏకంగా రూ. 1750 పెరిగాయి. ఇక వెండి ధర కేజీ మరో 100 పెరిగింది. 5 రోజుల్లో వెండి ధర రూ. 6600కి పెరగడం గమనార్హం.

ఇది చదవండి: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు

మంగళవారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాములు(తులం) బంగారం ధర రూ. 68,810 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేట్ విషయానికొస్తే.. 10 గ్రాములు(తులం) బంగారం ధర రూ.75 వేల 060 వద్ద ఉంది. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే ధర కొనసాగుతోంది. అటు ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 68,960గా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 75,160గా ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: రసికులకే పాఠాలు చెప్పి.. ఏకంగా ఎన్ని కోట్లు సంపాదించాడో తెల్సా

బంగారం బాటలోనే వెండి..

ఒక్క రోజులోనే ఏకంగా రూ. 1100 మేరకు పెరిగి కిలో వెండి రూ. 93,100 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ప్రస్తుతం రూ. 98,100 పలుకుతోంది. మరో రెండు లేదా మూడు రోజుల్లో లక్షకు చేరనుంది కిలో వెండి. ముంబై, ఢిల్లీలో కిలో వెండి రూ. 93,100 ఉండగా.. బెంగళూరులో కిలో వెండి రూ. 86,100గా ఉంది.

ఇది చదవండి: తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేసి చూడగా దిమ్మతిరిగింది

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..