Gold Price Today: ఇదేంటబ్బా.! బంగారం ధర భారీగా తగ్గిందండోయ్.. తులం ఎంతుందంటే.?

ఇంట్లో ఏదైనా పెళ్లి, లేదా శుభకార్యం ఉంటే చాలు.. మహిళలకు ఠక్కున గుర్తొచ్చేది బంగారం. పెట్టుబడిదారులకు కూడా పసిడి మంచి సాధనం. అటు వెండి కూడా బంగారం మాదిరిగా మంచి గిరాకీతో ఉంది. మరి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

Gold Price Today: ఇదేంటబ్బా.! బంగారం ధర భారీగా తగ్గిందండోయ్.. తులం ఎంతుందంటే.?
Gold Rates

Updated on: Feb 27, 2025 | 5:54 AM

గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్ వచ్చేసిందోచ్.. ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచి భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వృద్ది చెందటం, ఆర్ధిక సంక్షోభం, డాలర్ మారకంలో వచ్చిన మార్పులు లాంటి కారణాలు ఈ ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ఇక ఇప్పుడు గత రెండు రోజులుగా గోల్డ్ రేట్స్.. నేలచూపులు చూస్తున్నాయి. 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారంపై రూ. 280 మేరకు తగ్గగా.. 22 క్యారెట్ల బంగారం రూ. 260 మేరకు తగ్గింది. అటు వెండి ధరలు కూడా బంగారం బాట పట్టాయి. రెండు రోజుల్లో సుమారు రూ. 3100 మేరకు తగ్గింది. మరి తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా..

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 87,810 ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం రూ. 80,490గా ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం రూ. 87,810 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 80,490 వద్ద కొనసాగుతోంది. వెండి ధరల విషయానికొస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కేజీ వెండి ధర రూ. 1,05,900గా ఉంది. చెన్నైలో కూడా ఇదే రేటు కొనసాగుతోంది. అటు ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి రూ. 97,900గా ఉంది.

22 క్యారెట్ల బంగారం ధర..

  • చెన్నై – రూ. 80,490
  • బెంగళూరు – రూ. 80,490
  • ఢిల్లీ – రూ. 80,640
  • ముంబై – రూ. 80,490
  • కోల్‌కతా – రూ. 80,490

24 క్యారెట్ల బంగారం ధర..

  • చెన్నై – రూ. 87,781
  • బెంగళూరు – రూ. 87,781
  • ఢిల్లీ – రూ. 87,960
  • ముంబై – రూ. 87,781
  • కోల్‌కతా – రూ. 87,781

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..