Gold Price Today: మళ్లీ దూకుడు మీదున్న బంగారం ధరలు.. మరోసారి ఆ మార్క్‌ను దాటేసి

|

Jun 22, 2024 | 6:33 AM

బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయని ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో మరోసారి పెరిగి అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఒకానొక సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80 వేలకు చేరి దడ పుట్టించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో మళ్లీ రూ. 70 వేలకు చేరువైంది. అయితే తాజాగా....

Gold Price Today: మళ్లీ దూకుడు మీదున్న బంగారం ధరలు.. మరోసారి ఆ మార్క్‌ను దాటేసి
Gold Price
Follow us on

బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయని ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో మరోసారి పెరిగి అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఒకానొక సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80 వేలకు చేరి దడ పుట్టించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో మళ్లీ రూ. 70 వేలకు చేరువైంది. అయితే తాజాగా గడిచిన కొన్ని రోజులుగా మళ్లీ బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో తులం గోల్డ్‌ మళ్లీ రూ. 73వేల మార్క్‌ను దాటేసింది. మరి శనివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,310గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,410 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,160కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,260 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,810గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,980 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 67,160గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,260గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,160గా ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 73,260 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,160గా ఉండగా, 24 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర రూ. 73,260గా ఉంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,160వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,260గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి కూడా బంగారం బాటలోనే పయణిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం కిలో వెండిపై రూ. 100 వరకు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 94,100 వద్ద కొనసాగుతుండగా, హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర గరిష్టంగా రూ. 98,600 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..