Gold Price Today: మహిళలకు అదిరిపోయే న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. సోమవారం తులం ఎంతంటే?

Gold Price Today: బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాకుండా పెట్టుబడిగా చాలామంది భావిస్తుంటారు. అందుకే ప్రతిరోజూ బంగారం ధరపై ఎక్కువమంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఒక్కసారిగా తగ్గుముఖం పడుతోంది. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత తులం బంగారం ధర రూ. 10 వేల వరకు తగ్గడంతో బంగారం కొనే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది.

Gold Price Today: మహిళలకు అదిరిపోయే న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. సోమవారం తులం ఎంతంటే?
Gold Price
Follow us
Venkata Chari

|

Updated on: Jul 29, 2024 | 6:20 AM

Gold Price Today: బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాకుండా పెట్టుబడిగా చాలామంది భావిస్తుంటారు. అందుకే ప్రతిరోజూ బంగారం ధరపై ఎక్కువమంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఒక్కసారిగా తగ్గుముఖం పడుతోంది. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత తులం బంగారం ధర రూ. 10 వేల వరకు తగ్గడంతో బంగారం కొనే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది.

ఈ క్రమంలో బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. సోమవారం బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. అయితే రానున్న రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 24 క్యారెట్ల ధర రూ. 65 వేలకు చేరొచ్చని చెబుతున్నారు. మరి సోమవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

దేశరాజధాని న్యూఢిల్లీలో ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,390లు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,140ల వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.63,240లు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 68,990గా నమోదైంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,640కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,520 వద్ద కొనసాగుతోంది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,240కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 68,990 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

హైదరాబాద్‌లో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,240గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 68,990 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడతో పాటు, విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63,240, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 68,990గా నమోదైంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆదివారం వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పు కనిపించలేదు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ముంబయి, పుణెలో కిలో వెండి ధర రూ. 84,400కి చేరింది. అలాగే చెన్నై, హైదరాబాద్‌, కేరళ, విజయవాడ, విశాఖలో అత్యధికంగా కిలో వెండి ధర రూ. 88,900ల వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..