Gold Price Today: కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?

|

Jul 27, 2024 | 6:36 AM

బడ్జెట్‌ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరల్లో భారీగా తగ్గుదల కనిపించింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్‌ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో దిగుమతి భారం తగ్గింది. సుంకాన్ని తగ్గించడంతో కిలోకు సుమారు రూ.3.90 లక్షల వరకు బంగారం ధర తగ్గింది....

Gold Price Today: కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
Gold Price
Follow us on

బడ్జెట్‌ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరల్లో భారీగా తగ్గుదల కనిపించింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్‌ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో దిగుమతి భారం తగ్గింది. సుంకాన్ని తగ్గించడంతో కిలోకు సుమారు రూ.3.90 లక్షల వరకు బంగారం ధర తగ్గింది. దీంతో తులం బంగారం ఒకేసారి ఏకంగా రూ. వేల వరకు తగ్గడం విశేషం. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత తులం బంగారం ధర రూ. 68 వేలకు చేరింది. మరి శనివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,140గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 68,8870వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయి విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 62,990కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 68,720కి చేరింది.

* చైన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,970 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో గురువాం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,990గా ఉండ వేగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68,720 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 68,720 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 10 గ్రాముల తులం బంగారం ధర రూ. 62,990కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 68,720గా ఉంది.

* ఇక సాగర నగరం విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 62,990 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 68,720గా ఉంది.

వెండి విషయానికొస్తే..

వెండి కూడా బంగారం బాటలోనే పయణిస్తోంది. శనివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలో తగ్గుదుల కనిపించింది. కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో ఢిల్లీతో పాటు, ముంబయి, పుణెలో కిలో వెండి ధర రూ. 84,400కి చేరింది. అలాగే హైదరాబాద్‌, చెన్నై, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 88,900 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..