
మన దేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ పరిమాణాలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి, ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితమవుతాయి. అంతేకాదు బంగారం చాలా సంవత్సరాలుగా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఒక అద్భుతమైన రక్షణగా ఉంది. పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా ఎక్కువగా చూస్తున్నారు. గత కొంతకాలంగా పసిడి ధరలు పై పైకి చేరుకున్నాయి. నేను సైతం అంటూ వెండి ధరలు బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 11వ తేదీ) గురువారం తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో సహా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గురువారం ధరలు ఎలా ఉన్నాయంటే…
హైదరాబాద్ లో పసిడి ధర బుధవారం వలెనే గురువారం కూడా స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10మేర పెరిగి రూ. 1,10,519లకు చేరుకుంది. ఈరోజు గ్రాముకు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10మేర పెరిగి రూ. 82,890లకు చేరుకుంది. ఇవే ధరలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాలైన వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, పొద్దుటూరులో కూడా కొనసాగుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,01,460గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,670 లుగా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,490గా ఉంది 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్ల ధర రూ.1,10,720 లకు చేరుకుంది.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,10,520 లుఉండగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.రూ.1,01,310గా కొనసాగుతోంది. ఇవే ధరలు చెన్నై , కోల్‌కతా , బెంగళూరు, కేరళ వంటి ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి.
ఈ రోజు వెండి ధర ఎలా ఉన్నదంటే..
బంగారం తర్వాత వెండి కొనుగోలుకి ఆసక్తిని చూపిస్తారు. వెండిని ఆభరణాలు, నాణేలు వంటి వాటి తయారీ కోసమే కాదు రసాయనిక చర్యలలో ఉత్ప్రేరకంగా కూడా ఉపయోగిస్తున్నారు. మరోవైపు వెండిపై పెట్టుబడి పెట్టడం సురక్షితం అని భావిస్తున్నారు. దీంతో వెండి ధరలు కూడా రెక్కలు వచ్చాయి. అల్ టైంకి చేరుకున్నాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు వెండి ధర సెప్టెంబర్ 11 వ తేదీ గురువారం ఎలా ఉందో తెలుసుకుందాం..
ఈ రోజు హైదరాబాద్ లో కేజీ వెండి ధర1,39,900 లకు చేరుకుంది. విజయవాడ, ప్రొద్దుటూరు, రాజమహేందరవరంలో ఇవే ధరలు ఉండగా.. దేశ రాజధాని డిల్లీ లో రూ.1,29,900లుగా ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..