Banks on new credit cards : ఆర్థిక ఇబ్బందుల్లో ఆసరాగా ఉన్న క్రెడిట్ కార్డు ఇకపై భారం కానుంది. ఇకపై కొత్త క్రెడిట్ కార్డు పొందడం అంత సులువుకాదు. ఈమేరకు కొత్త నిబంధనలను అమలు చేసేందుకు అయా బ్యాంకులు సిద్దమవతున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగిపోతుంది. ప్రస్తుతం నగదు లావాదేవీల కంటే ఆన్‌లైన్ లావాదేవీలు అధికమయ్యాయి. దీంతో వారి వ్యక్తిగత అవసరాల కోసం క్రెడిట్ కార్డును విపరీతంగా వాడకం పెరిగింది. దీనికి తగ్గట్లే షాపింగ్ మాల్స్, ఈ-కామర్స్, బ్యాంకులు క్రెడిట్ కార్డుల మీద వివిధ ఆఫర్లు ప్రకటించి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. దీంతో అవసరం ఉన్నా, లేకున్నా కూడా వస్తువులు కొని తర్వాత లోన్ కట్టలేక పోతున్నారు. దీని వల్ల అటు బ్యాంకులకు కూడా దీర్ఘకాలంలో నష్టం వాటిల్లుతున్నాయి.
అయితే, ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు బ్యాంకులు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి సమయంలో బ్యాంకులు క్రెడిట్ కార్డు విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక నుంచి వినియోగదారులు క్రెడిట్ కార్డులను పొందడం ఈజీ కాకపోవచ్చు. ప్రస్తుతం క్రెడిట్ కార్డు హోల్డర్లు ఉండటంతో క్రెడిట్ లావాదేవీలపై లిమిట్ తగ్గించడంతో పాటు కొత్త కార్డు తీసుకొనాలనుకునే వారి సిబిల్ స్కోర్‌ను తప్పనిసరి చేయనుంది. సిబిల్ స్కోర్ బాగున్నవారికి మాత్రమే ఇక నుంచి క్రెడిట్ కార్డులను ఇవ్వాలని తాజాగా బ్యాంకులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ లో రుణాలు మంజూరు చేసే ముందు వినియోగదారుల క్రెడిట్ స్కోర్ ను బ్యాంకులు పరిగణనలోకి తీసుకోనున్నాయి. గత ఏడాది మొండిబాకీలు పెరగడంతో ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
Read Also:
Kamal Haasan : ఆటో ఎక్కిన కమల్ హాసన్.. కోయంబత్తూర్ లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం
Viral video : కదులుతున్న కారుపైకి ఎక్కి పుషప్స్ చేశాడు.. కానీ చివరకు ఏమైందంటే..