Car Loan: సహజంగా ఎవరైనా మొదటి ప్రాధాన్యతను ఇంటికి ఇస్తాడు. ఇళ్లు నిర్మాణం చేసుకున్న తర్వాత ప్రాయారిటీ కారుకే ఇస్తారు. ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ మరీ ఎక్కువైంది. కార్ల ధరలు మధ్య తరగతి వారికి కూడా అందుబాటులోకి వస్తుండడం. బ్యాంకులు కూడా రకరకాల ఆఫర్ల పేరిట లోన్‌లు ఇస్తుండడంతో చాలా మంది కార్ల కొనుగోలుకు మొగ్గు చూపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కొన్ని ప్రధాన బ్యాంకులు కార్ లోన్‌కు ఎంత వడ్డీలు వసూలు చేస్తున్నాయి. నెలకు ఎంత ఈఎమ్‌ఐ కట్టాలి లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
లక్ష రూపాయల లోన్‌కు ఐదేళ్లలో తిరిగి చెల్లించేందుకు వడ్డీ, ఈఎమ్‌ఐతో పాటు ప్రాసెసింగ్ ఫీజులకు సంబంధించిన వివరాలు…
* సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.05 – 7.80 వడ్డీరేటుతో లోన్ అందిస్తుండగా నెలకు రూ.1,982- రూ.2,018 ఈఎమ్‌ఐగా ఉంది. ఇక లోన్ కోసం రూ.500 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
* పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 7.10 – 7.90 వడ్డీరేటుతో లోన్ అందిస్తుండగా నెలకు రూ.1,985 – రూ.2,023 ఈఎమ్‌ఐగా ఉంది. ఇక ఈ బ్యాంక్ పండగల సందర్భంగా జీరో ప్రాసెసింగ్ ఫీజుతో లోన్‌లు అందిస్తోంది.
* బ్యాంక్ ఆఫ్ భరోడా 7.10 – 10.10 వడ్డీరేటుతో లోన్ అందిస్తుండగా నెలకు రూ.1,985- రూ.2,130 ఈఎమ్‌ఐగా ఉంది. ఇక లోన్ మొత్తంలో 0.50 శాతం + జీఎస్‌టీని ప్రాసెసింగ్ ఫీజుగా వసూళు చేస్తారు.
* ఐసీఐసీఐ బ్యాంక్ 7.90 – 9.85 వడ్డీరేటుతో లోన్ అందిస్తుండగా నెలకు రూ.2,023 – రూ. 2,117 ఈఎమ్‌ఐగా ఉంది. ఇక లోన్ అమౌంట్ ఆధారంగా ప్రాసెసింగ్ ఫీజు రూ.3,500 నుంచి రూ. 8,500 మధ్య ఉంది.
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 7.70 – 11.20 వడ్డీరేటుతో లోన్ అందిస్తుండగా నెలకు రూ.2,013 – రూ. 2,184 ఈఎమ్‌ఐగా ఉంది. లోన్ ప్రాసెసింగ్ విషయానికొస్తే లోన్ మొత్తంలో 0.25 శాతం+జీఎస్‌టీ. (గరిష్టంగా రూ.7,500)
* పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) 7.30 – 7.80 వడ్డీరేటుతో లోన్ అందిస్తుండగా నెలకు రూ. 1,994 – రూ. 2,018 ఈఎమ్‌ఐగా ఉంది. ఈ బ్యాంక్ మార్చి 31 వరకు ప్రాసెసింగ్ లేకుండానే లోన్‌లు అందిస్తోంది.
* ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ 7.55 వడ్డీరేటుతో లోన్ అందిస్తుండగా నెలకు రూ. 2006 ఈఎమ్‌ఐగా ఉంది. లోన్ ప్రాసెసింగ్ విషయానికొస్తే లోన్ మొత్తంలో 0.60 శాతం+జీఎస్‌టీ. (గరిష్టంగా రూ.10,000)
చాలా వరకు ఈఎమ్‌ఐ తక్కువగా ఉంటే లాభంగా భావిస్తుంటారు. ఇందుకోసం రుణాన్ని తిరిగి చెల్లించే కాల పరిమితిని ఎక్కువ కాలం పెట్టుకుంటారు. కానీ దీనివల్ల ఎక్కువ మొత్తంలో వడ్డీని చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు తక్కువ కాల పరిమితిలోనే రుణాన్ని తిరిగి చెల్లించేలా ప్లాన్ చేసుకుంటే వడ్డీ ఆదా అవుతోంది. మరీ పైన తెలిపిన వివరాల ఆధారంగా మీకు నచ్చిన బ్యాంకులో కార్‌లోన్ ప్లాన్ చేసుకోండి.
Also Read: క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. ఇకపై కార్డులు పొందడం అంత ఈజీ కాదంటున్న బ్యాంకులు..!