
భారతదేశంలో యువత ఎక్కువగా ఇటీవల కాలంలో బైక్స్ వాడకాన్ని అమితంగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ బైక్స్ ఉండడం స్టేటస్ సింబల్‌లా ఫీలవుతున్నారు. ఈ నేపథ్యంలో యువతను ఆకట్టుకునేందుకు అన్ని కంపెనీలు సరికొత్త మోడల్స్‌లో బైక్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. బజాజ్ ఆటో కొద్ది రోజుల క్రితం భారతదేశంలో పల్సర్ ఎన్ఎస్ 200కు సంబంధించిన నవీకరించిన వెర్షన్‌ను రిలీజ్ చేసింది. ఈ బైక్ రూ.1,57,427 (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న హీరో ఎక్స్‌ట్రీమ్ 200 ఎస్‌కు ఈ బైక్ పోటీనివ్వనుంది. ఇటీవల కాలంలో యువత ఎక్కువగా 200 సీసీ బైక్స్‌ను ఇష్టపడుతున్న తరుణంలో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈ రెండు బైక్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశం అంతటా ప్రీమియం పెద్ద కెపాసిటీ మోటార్ సైకిళ్లకు డిమాండ్ పెరిగింది. బజాజ్ ఎన్ఎస్ 200 టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్, హీరో ఎక్స్‌ట్రీమ్ 200 ఎస్ వంటి ప్రత్యర్థులతో పోటీపడుతుంది. ముఖ్యంగా బజాజ్ పల్సర్ ఎన్ఎం 200, హీరో ఎక్స్‌ట్రీమ్ 200 ఎస్ మార్కెట్‌లో ప్రధాన పోటీదారులుగా నిలిచాయి. ఇందులో కొత్తగా ప్రారంభించబడిన అప్‌డేటెడ్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ధర రూ.1.57 లక్షలు (ఎక్స్-షోరూమ్). మరోవైపు హీరో ఎక్స్‌ట్రీమ్ 200 ఎస్ ధర రూ.1.41 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అంటే బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది.
కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్200లో 199.5 సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. ఆరు-స్పీడ్ ట్రాన్స్ మిషన్‌తో వస్తుంది. ఈ20 కంప్లైంట్ ఇంజన్ 9,750 ఆర్‌పీఎం వద్ద 24.13 బీహెచ్‌పీ గరిష్ట శక్తితో 8,000 ఆర్‌పీఎం వద్ద 18.74 ఎన్ఎం గరిష్ట టార్క్ ను విడుదల చేస్తుంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 200 ఎస్ 199.6 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఆధారంగా పని చేస్తుంది. ఈ బైక్ 8,500 ఆర్‌పీఎం వద్ద 18.8 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని, 6,500 ఆర్‌పీఎం వద్ద 17.35 ఎన్ఎం గరిష్ట టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ బైక్ ఇంజిన్ ఐదు-స్పీడ్ ట్రాన్స్ మిషన్‌తో వస్తుంది. బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 హీరో మోటోకార్ప్ నుంచి దాని ప్రత్యర్థి ఎక్స్‌ట్రీమ్ 200 ఎస్‌తో పోలిస్తే మరింత శక్తిని కొంచెం ఎక్కువ టార్క్‌ను అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి