
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ సొంత ఇల్లు కొనాలని కలలు కంటూ ఉంటారు. అయితే పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రుణం లేకుండా కొనుగోలు చేయడం సులభం కాదు. ఆర్థికపరమైన విషయాలే కాకుండా ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు సౌకర్యాలు, స్థానికత, కనెక్టివిటీ వంటి ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణం అందించడానికి ఉత్సాహంగా ఉన్నప్పటికీ వడ్డీ రేట్లు మారడం రుణగ్రహీతకు సంబంధించిన ప్రధాన ఆందోళనకు కారణంగా ఉంటుంది. గృహ రుణాలు ఫ్లోటింగ్ లేదా స్థిర వడ్డీ రేట్లతో వస్తాయి. ముఖ్యంగా ఈఎంఐపై ప్రభావం చూపుతుంది. కాబట్టి రుణగ్రహీతలు రుణం పొందే ముందు కచ్చితంగా వడ్డీ రేట్లపై అవగాహనతో ఉండాలి. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఫ్లోటింగ్ వడ్డీ రేటు అనేది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి మారే వడ్డీ రేటును సూచిస్తుంది. ఈ రకమైన వడ్డీ రేటు అనేక మంది రుణదాతలు అందించే బేస్ రేటుపై ఆధారపడి ఉంటుంది. బేస్ రేటు మారిన తర్వాత, వడ్డీ రేటు వెంటనే సవరించబడుతుంది.
ఫిక్స్‌డ్ వడ్డీ రేటు రుణం వడ్డీ రేటును కలిగి ఉంటుంది. అది రుణ వ్యవధిలో మారదు. ఇది రుణగ్రహీత భవిష్యత్ చెల్లింపులను ఖచ్చితంగా అంచనా వేయడానికి వీలు కల్పిస్తుంది.
ఇది మీ నెలవారీ ఈఎంఐపై ఆధారపడి ఉండవచ్చు. ఇది మీ నెలవారీ టేక్-హోమ్ పేలో 25-30 శాతం మధ్య ఉండాలి. అయితే భవిష్యత్తులో పెరిగిన వడ్డీ రేట్లను అంచనా వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత రేటుతో మీ హౌస్ లోన్‌ను లాక్-ఇన్ చేయాలనుకుంటే మంచి ఎంపిక అని సూచిస్తున్నారు. ఫిక్స్‌డ్-రేట్ హోమ్ లోన్‌ను ఎంచుకోవడం వలన మీరు మొదటి నుండి మీ చెల్లింపులు ఎలా ఉంటాయో? మీకు తెలుసు కాబట్టి మీకు భరోసాను అందిస్తుంది. తద్వారా మీరు బడ్జెట్‌ను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. అలాగే మీ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించవచ్చు.
ప్రస్తుతం ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు సర్వసాధారణం అవుతున్నాయి. అయితే గృహ కొనుగోలుదారులకు అగ్ర ఎంపికగా పరిగణిస్తున్నారు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు కూడా తక్కువ, ఆకర్షణీయమైన రేటుతో గృహ రుణ వడ్డీని (ఫ్లోటింగ్) అందిస్తున్నాయి. స్థిర వడ్డీ రేట్ల కంటే ఫ్లోటింగ్ రేట్లు తక్కువగా ఉంటాయి. స్థిర వడ్డీ రేట్లు ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల కంటే 1–2.5 శాతం ఎక్కువని గమనించాలి. మార్కెట్ పరిణామాలకు ప్రతిస్పందనగా ఫ్లోటింగ్ వడ్డీ రేటు హెచ్చుతగ్గులకు లోనవుతుంది కాబట్టి ఏదైనా పెరుగుదల లేదా తగ్గుదల తాత్కాలికమే. గృహ రుణం రుణదాతతో దీర్ఘకాలిక నిబద్ధతను కలిగి ఉంటుంది. అందువల్ల ఆర్థిక బాధ్యతల కోసం ప్లాన్ చేయడం కష్టం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..